ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crow Video: ఈ కాకికి ఉన్న బుద్ధి మనుషులకు లేకుండా పోతోందిగా.. డస్ట్ బిన్ దగ్గర ఈ కాకి చేసిందేంటో చూడండి..!

ABN, First Publish Date - 2023-07-21T19:35:56+05:30

కాకి అత్యంత జాగ్రత్తగా వాడిపారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను డస్ట్‌ బిన్‌లో వేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాకికి ఉన్న బుద్ధి కొందరు మనుషులకు లేకుండా పోయిందని నెటిజన్లు బాధపడ్డారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో ఏమూలైనా చెత్త పేరుకుపోతే తెగ చిరాకు పడిపోతాం. దాన్ని అక్కడి నుంచి తొలగించి చెత్త డబ్బాలో వేస్తే కానీ మనసు శాంతించదు. ఇల్లు శుభ్రంగా ఉంచుకునేందుకు ఎంతో కష్టపడతాం. అదే రోడ్డు మీద ఉన్నప్పుడు మనలో డేంజరస్ ఫెలో బయటకు వచ్చేస్తాడు. వాడిపారేసిన బాటిల్‌ లేదా టిష్యూ పేపర్‌ను మరో ఆలోచన లేకుండా రోడ్డు మీద పడేస్తాం. చెత్త డబ్బా కాస్తంత దూరంలో ఉంటే చెత్తను అందులోకి విసిరేసే ప్రబుద్ధులు మరికొందరు ఉంటారు. అది వాళ్లకో సరదా ఆట. అది చెత్త డబ్బా పక్కనే పడినావారు మళ్లీ దాన్ని ఎత్తి డబ్బాలో వేయరు. కానీ ఇలాంటి వాళ్లందరూ సిగ్గుపడే ఘటన ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది.

వీడియోలో ఓ కాకి, వాడిపడేసిన ఖాళీ వాటర్ బాటిల్‌ను జాగ్రత్తగా చెత్త బుట్టలో వేసింది. మొదట బాటిల్‌ను ముక్కుతో పట్టుకుని పక్కనే ఉన్న చిన్న స్తంభం మీద వాలింది. అక్కడున్న వారికి ఇది చూసి ఆస్తక్తి పెరిగింది. కాకి నెక్స్ట్ ఏం చేయబోతోందా అని ఉత్కంఠతో చూడటం ప్రారంభించారు. ఇంతలో కాకి చెత్తబుట్ట మీద వాలింది. చెత్త బుట్టకు ఉన్న కన్నం లోంచి బాటిల్‌ను లోపలకు జార విడిచేందుకు ప్రయత్నించింది. రెండు మూడు సార్లు ప్రయత్నించినా పని అనుకున్నట్టు జరగలేదు. కానీ కాకి మాత్రం సహనంగా మరోమారు ప్రయత్నించింది. రెండు సార్లు ఫెయిలయిన అనుభవంతో మూడోసారి జాగ్రత్తగా ప్రయత్నించింది. కన్నంలోకి బాటిల్‌ను ఒడుపుగా దూర్చింది. బాటిల్ చివరి భాగం మొత్తం కన్నంలోకి దూరగానే బాటిల్‌ను అందులోకి జార విడిచింది.(Raven carefully puts plastic bottle in dust bin)

నెట్టింట ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. జనాలు కాకి తెలివికి ఫిదా అయిపోయారు. మనుషులకన్నా కాకులే బెటర్ అంటూ మరికొందరు విచారం వ్యక్తం చేశారు. ఇది చూసి మనుషులుగా మనందరం సిగ్గుతో తలదించుకోవాలని చెప్పుకొచ్చారు. మరోవైపు, కాకి తెలివితేటలపై కూడా జనాలు పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఏపని జరుగుతుందో ఏపని జరగదో అంచనా వేసి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం చింపాంజీలు, కోతుల వంటి ప్రైమేట్ జాతి జీవుల తరువాత కాకులకే ఉందని కొందరు విశదీకరించారు.

Updated Date - 2023-07-21T19:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising