ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bamboo Climbing Video: వామ్మో.. ఈ సైనికుల విన్యాసాలు చూస్తుంటేనే మతిపోతోంది.. ఓ సైనికుడి భుజంపై కర్రను నిల్చోబెట్టి..!

ABN, First Publish Date - 2023-06-12T20:24:34+05:30

అస్సాం రెజిమెంట్లోని నాగా సైనికులు చేసిన విన్యాసాలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: దేశరక్షణే పరమావధిగా గల సైనికుల్లో శారీరక, మానిసిక సామర్థ్యాలు అసాధారణ రీతిలో ఉంటాయి. వారికి ఇచ్చే ట్రైనింగే దీనికి కారణం. ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా లక్ష్యాన్ని నేర్పుగా ఛేదించడంలో సైనికులు సిద్ధహస్తులు. దీనికి ఉదాహరణగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్(Viral Video) అవుతోంది. వీడియోలోని సైనికుల విన్యాసాలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వామ్మో.. ఈ సైనికులను చూస్తుంటేనే మతిపోతోంది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఓ ఆర్మీ అధికారి ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అస్సాం రెజిమెంట్‌లోని(Assam Regiment) నాగా సైనికుల(Naga Soldiers) విన్యాసాలు(Stunts) అద్భుతమంటూ కామెంట్ చేశారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తొలుత ఓ సైనికుడు తన భుజంమీద ఓ కర్రను నిలబెట్టాడు. ఆ తరువాత వెనుక ఉన్న మరో సైనికుడు మొదటి జవాను భుజం మీదుగా ఎక్కి ఆపై కర్రపట్టుకుని ఎక్కుతూ చివరి వరకూ వెళ్లిపోయాడు. అనంతరం, కర్ర చివరను తన కడుపును ఆన్చి చాలా లాఘవంగా తన శరీరాన్ని బ్యాలెస్స్ చేశాడు. ఇదంతా చూసిన నెటిజన్లకు మతిపోయినంత పనైంది.

సైనికుడి దేహధారుఢ్యం, నైపుణ్యం చూసి అనేక మంది ఆశ్చర్యపోయారు. సైనికుల సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. దేశంలో నిజమైన హీరోలు అంటే వీరే అంటూ మరికొందరు ప్రశంసించారు. జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇందుకే ఇచ్చారు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఇప్పటిరవరకూ ఈ వీడియోకు సుమారు 40 వేల వరకూ వ్యూస్ వచ్చాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ వీడియోను తప్పకుండా చూడాల్సిందే.

Updated Date - 2023-06-12T20:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising