Viral Video: మాష్టారూ.. మీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్.. అక్షరాలు నేర్పేందుకు వెరైటీ గేమ్.. నెట్టింట ప్రశంసల జల్లు..!
ABN, First Publish Date - 2023-07-28T21:29:09+05:30
పిల్లలకు గుణింతాలు నేర్పించేందుకు ఈ మాస్టారు ఎంచుకున్న పద్ధతి నెటిజన్లు అమితంగా ఆకర్షిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇది స్మార్ట్ ఫోన్ల యుగం. నగరాల్లోని పిల్లలు అత్యాధుని టెక్నాలజీ సాయంతో కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. మరి గ్రామీణ ప్రాంతాల పాఠశాలల్లో పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కానీ, నిబద్ధత గల ఉపాధ్యాయులు మాత్రం తమ మెదడుకు పదును పెడుతూ గ్రామీణ విద్యా్ర్థులను నగరాల్లోని వారితో పోటీపడేలా చేస్తున్నారు. ఇందుకు తాజాగా ఉదాహరణే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్(Viral Video) అవుతున్న ఉదంతం. వీడియోలో మాస్టారు క్రియేటివిటీ చూసి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. వసతులు తక్కువైనా పిల్లలకు జ్ఞానం పంచేందుకు మాస్టారు పడుతున్న తపన వారిని కదిలించింది(Teachers unique method of teaching alphabet).
పిల్లలకు గుణింతాలు నేర్పేందుకు ఈ మాస్టారు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ముందుగా ఆయన బోర్డుపై అన్ని శబ్దాల చిహ్నాలను రాశారు. ఆ తరువాత ఒక్కో అక్షరం రాసున్న చిన్న అట్టముక్కను చిన్న కర్రపై అతికించి విద్యార్థికి ఇచ్చారు. అతడు అక్షరమున్న అట్టను బోర్డు మీద పెట్టి అదే శబ్దమో పలికితే మిగతా క్లాసంతా అతడు చెప్పినట్టు పలుకుతుందన్న మాట. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పిల్లలకు సులువుగా పాఠాలు అర్థమయ్యేలా చేసేందుకు ఆయన పడుతున్న శ్రమ చూసి ఆశ్చర్యపోతున్నారు. మీలాంటి గురువులకు వేల వేల వందనాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Updated Date - 2023-07-28T21:33:49+05:30 IST