ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijay: ‘వారిసు’ ఓటీటీ డేట్ ఫిక్స్!

ABN, First Publish Date - 2023-01-28T16:09:46+05:30

సౌతిండియాలోని స్టార్ హీరోల్లో ఇళయ దలపతి విజయ్ (Vijay) ఒకరు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘వారిసు’ (Varisu). ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) టైటిల్‌తో డబ్ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌతిండియాలోని స్టార్ హీరోల్లో ఇళయ దలపతి విజయ్ (Vijay) ఒకరు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘వారిసు’ (Varisu). ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) టైటిల్‌తో డబ్ అయింది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహించారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది. థియేటర్స్‌లో ఈ మూవీని మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అందరి ఎదురు చూపులకు తెర పడినట్టే కనిపిస్తుంది. ‘వారిసు’ అతి త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని వదంతులు షికార్లు కొడుతున్నాయి.

‘వారిసు’ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఈ మూవీ ఫిబ్రవరి 10 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి త్వరలోనే రానుందని సమాచారం అందుతుంది. మూవీ రిలీజ్ అయిన 30రోజుల తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానుంది. ‘వారిసు’ ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. విజయ్ నుంచి ‘బీస్ట్’ (Beast) తర్వాత వచ్చిన చిత్రమిది. ఇక విజయ్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి 67’ (Thalapathy 67) అని వ్యవహరిస్తున్నారు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది.

Updated Date - 2023-01-28T16:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising