అక్కడ పిల్లల ఆటలపై నిషేధం... కిడ్నాప్, పిల్లలను ఎత్తుకెళ్లేవారు, దెయ్యాలు లాంటి భయాలేం లేవు... అసలు కారణం ఏమిటో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-04-01T09:37:17+05:30
మన దేశంలో పిల్లలు(children) ఆరుబయట రోడ్లమీద ఆడుకుంటుంటారు. అయితే ఆ దేశంలో దీనికి భిన్నంగా జరుగుతుందని తెలిస్తే తెగ ఆశ్చర్యపోతారు. డైలీ స్టార్(Daily Star) నివేదిక ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్(United Kingdom)లో నార్విచ్ అనే ప్రాంతం ఉంది.
మన దేశంలో పిల్లలు(children) ఆరుబయట రోడ్లమీద ఆడుకుంటుంటారు. అయితే ఆ దేశంలో దీనికి భిన్నంగా జరుగుతుందని తెలిస్తే తెగ ఆశ్చర్యపోతారు. డైలీ స్టార్(Daily Star) నివేదిక ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్(United Kingdom)లో నార్విచ్ అనే ప్రాంతం ఉంది. నార్విచ్(Norwich)లోని జనం తమ పిల్లలను బయట ఆడుకోవడంపై నిషేధం విధించారు. పిల్లలు బయటకు వెళితే తిరిగి రారేమో అనే భయం(fear) వారిని వెంటాడుతోంది.
పిల్లలను కిడ్నాప్ చేయడం లేదా పిల్లలను చంపే నేరస్థులు(Criminals) గ్రామంలో సంచరిస్తున్నారనే కారణం కూడా దీనివెనుక లేదు. ఆ గ్రామంలో దెయ్యాలు(ghosts), లేదా ఏవైనా ఆత్మలు తిరుగుతున్నాయన్న భయం కూడా వారికి లేదు. అయితే ఇక్కడి తల్లిదండ్రులు(parents) తమ పిల్లలను ఒంటరిగా బయటకు వెళ్లనివ్వకపోవడానికి గల కారణం ఏమిటనే ప్రశ్న మీ మదిలో తలెత్తే ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ గ్రామం సురక్షితంగాలేని ప్రదేశంలో ఉన్నందున.. తమ పిల్లలు బయటకు వెళితే భూమిలో సమాధి(grave) అవుతారని ఆ గ్రామంలోని తల్లిదండ్రులు భయపడుతుంటారు. థోర్ప్ హామ్లెట్(Thorpe Hamlet) అనే ఈ చిన్న గ్రామంలో పిల్లలు ఇంటి నుండి బయటకు వెళ్లడం ఎంతో ప్రమాదకరం(dangerous)గా మారింది. ఈ గ్రామంలోని రహదారుల్లో చాలా గుంతలు ఉండటంతో ఎవరు ఎప్పుడు వాటిలో పడతారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇంతేకాదు ఈ గ్రామంలో మరిన్ని చోట్ల నిరంతరం గుంతలు(pits) పెరుగుతున్నాయని. వీటికారణంగా తమ ఇళ్లకు కూడా ముప్పు వాటిల్లుతున్నదని గ్రామస్తుల వాపోతున్నారు. అందుకే అక్కడి ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లడం మానేశారు. ఈ గ్రామంలో ఏకంగా 12 అడుగుల లోతు గుంతలు ఏర్పడుతుండటంతో గ్రామస్తులు(Villagers) బెంబేలెత్తిపోతున్నారు. బయటకు వెళితే ఏం జరుుగుతోందని భయంభయంగా కాలం గడుపుతున్నారు.
Updated Date - 2023-04-01T09:47:37+05:30 IST