ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ టైమ్‌లో పొలంలోంచి పొగలేంటని కూలీలకు డౌట్.. వెళ్లి చూస్తే కనిపించిన సీన్‌తో షాక్.. ఓ వ్యక్తి కట్టెలుపేర్చి కాల్చుతున్నదేంటో తెలిసి..

ABN, First Publish Date - 2023-02-27T17:41:40+05:30

ఏవైనా పొలాలు తగలబడ్డాయేమో అని కంగారు పడ్డారు కానీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యాహ్నం 2గంటల సమయం ఎండ దంచి కొడుతోంది. ఆ సమయంలో ప్రజలందరూ ఇంటిపట్టునే ఉన్నారు. ఆరుబయట కాస్త చెట్టునీడ ఉండటంతో కూలీగా పనిచేసే ఓ వ్యక్తి ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. దూరంగా పొలాల నుండి పొగ పైకి లేస్తుండటం చూసి ఈ సమయంలో పొగ ఏంటి అని డౌటొచ్చింది. వెంటనే ఇరుగు పొరుగున నివసిస్తున్న మిగిలిన కూలీలకు విషయం చెప్పాడు. ఇరుగు పొరుగు వారు ఏవైనా పొలాలు తగలబడ్డాయేమో అని కంగారు పడ్డారు. భయం భయంగా పరిగెత్తుకుంటూ పొగ వస్తున్నచోటికి చేరుకున్నారు. కానీ పొలంలో ఓ వ్యక్తి కట్టెలు పేర్చి కట్టుకున్న భార్యను కాలుస్తూ కనిపించాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం అగర్ మాల్వా(Agae Malwa) జిల్లాలో ధరోలా(Dharola) గ్రామం ఉంది. ఈ గ్రామంలో భిలాలా అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని భార్య పేరు సీమ. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరుగుతూ ఉండేవి. భిలాలాకు భార్య మీద మంచి అభిప్రాయం లేదు. దీంతో అమెను ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతను అతని భార్యా ఇద్దరూ పొలం పనులు చేస్తుండగా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఆవేశానికి లోనైన భిలాలా భార్యను దారుణంగా కొట్టాడు. అతను కొట్టిన దెబ్బలకు ఆమె చచ్చిపోయింది. ఆ తరువాత భిలాలా తన భార్య చనిపోయిన విషయం ఎవరికీ తెలియకూడదని సాక్ష్యాలు అన్నీ మాయం చేయాలనే ఉద్దేశంతో భార్యను కాల్చేయాలని అనుకున్నాడు. పొలంలో కట్టెలు సేకరించి, వాటిని చితిగా పేర్చి సీమను ఆ చితిమీద పడుకోబెట్టి తగలబెట్టాడు. గ్రామంలో వారికి పొలం నుండి పొగ పైకిలేస్తూ కనబడేసరికి వారు పరుగులు పెడుతూ భిలాలా దగ్గరకు చేరుకున్నారు. గ్రామస్తులు చితిమీద భిలాలా భార్య కాలుతుండటం చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Read also:ఈ పెళ్లిని ఆపండి.. గట్టిగా అరిచాడో బంధువు.. ఏంటని అంతా నిలదీస్తే వరుడి గురించి అతడు చెప్పిన నిజం విని అంతా షాక్..!


పోలీసులు భిలాలా పొలం దగ్గరకు చేరుకునేసరికి సీమ మృతదేహం పూర్తిగా కాలిపోయి బూడిద అయిపోయింది. పోలీసులు భిలాలాను విచారించారు. పోలీసుల ముందు తన భార్యను కొట్టి చంపేసినట్టు భిలాలా అంగీకరించాడు. విషయం తెలుసుకున్న సీమ తల్లిదండ్రులు తమ కూతురిని తమ అల్లుడు ఎప్పుడూ కొడుతూ ఉండేవాడని వాపోయారు. 'అతనలా కొడుతుంటే పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని ఎప్పుడో అనుకున్నాం కానీ ఎందుకో సంకోచించాం, చివరికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేయాలని కూడా అనుకున్నాం. కానీ ఇంత ఘోరం చేస్తాడని అనుకోలేదు' అని పోలీసుల ఎదుట వాపోయారు. పోలీసులు భిలాలాను అరెస్ట్ చేసారు. కేసు విచారణ జరుగుతోంది.

Updated Date - 2023-02-27T17:46:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising