Viral Video: ఛీ..ఛీ.. ఏం మనుషులో.. పాపం ఈ చిరుత పులి..!
ABN, First Publish Date - 2023-08-30T19:28:03+05:30
చిరుత పులిని చూస్తేనే ఎంతటి ధైర్యవంతులకైనా గుండెలు జారిపోతాయి. కానీ.. అదే చిరుత అనారోగ్యానికి లోనై ఇబ్బంది పడుతూ ఉంటే ఎంతటి పిరికివాడికైనా ధైర్యం వస్తుంది. దగ్గరకు వెళ్లి చిరుత పులిని పిల్లిలా ట్రీట్ చేస్తారు. అంతటితో ఆగక మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలోని ఇక్లేరా గ్రామంలోని కొందరు ఓవరాక్షన్ చేశారు.
చిరుత పులిని చూస్తేనే ఎంతటి ధైర్యవంతులకైనా గుండెలు జారిపోతాయి. కానీ.. అదే చిరుత అనారోగ్యానికి లోనై ఇబ్బంది పడుతూ ఉంటే ఎంతటి పిరికివాడికైనా ధైర్యం వస్తుంది. దగ్గరకు వెళ్లి చిరుత పులిని పిల్లిలా ట్రీట్ చేస్తారు. అంతటితో ఆగక మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలోని ఇక్లేరా గ్రామంలోని కొందరు ఓవరాక్షన్ చేశారు. చిరుత పులి మీదకు రావడం లేదన్న ధైర్యంతో ఆ మూగ జీవంపై స్వారీ చేస్తూ, సెల్ఫీలు దిగుతూ ఫోజులిచ్చారు. అనారోగ్యంతో ఉన్న ఒక వన్య ప్రాణి విషయంలో ఇలా ప్రవర్తించిన ఈ గ్రామస్తుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మృగం ఆ చిరుత కాదని, అక్కడ చిరుతతో అలా అమానుషంగా ప్రవర్తించిన మనుషులే మృగాలని నెట్టింట మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ గ్రామస్తుల దుశ్చర్య బయటికొచ్చింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇక్లేరా అనే గ్రామం అడవి ప్రాంతంలో ఉంటుంది. ఆ అడవి నుంచి దారితప్పి అనారోగ్యానికి గురైన స్థితిలో ఒక చిరుత పులి గ్రామ సమీపానికి వచ్చింది. చిరుతను చూసి తొలుత గ్రామస్తులు భయపడ్డారు. కానీ.. ఆ చిరుత దాడి చేసేంత స్థితిలో లేదని తెలుసుకున్నాక దాని దగ్గరకు వెళ్లారు. ఆ చిరుత చుట్టూ కొందరు కమ్ముకుని అనారోగ్యంగా ఉన్న ఆ మూగజీవితో ఆటలాడారు. పక్కనే నిల్చుని సెల్ ఫోన్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.
ఒకరైతే ఏకంగా.. గుర్రంపై స్వారీ చేసినట్టు ఆ చిరుతపై స్వారీ చేస్తూ అతిగా ప్రవర్తించాడు. ఆ గ్రామానికి చెందిన ఒకరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీ శాఖ అధికారులు ఆ చిరుత పులికి వైద్యం అందించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారి ఒకరు స్పందిస్తూ.. అభివృద్ధి పేరుతో అడవుల్ని నరికివేస్తూ వన్య ప్రాణుల జీవనానికి భంగం కలిగిస్తున్నామని, ఇలా దారి తప్పి వచ్చిన ఒక చిరుత పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తించడం సిగ్గుచేటని చెప్పారు.
Updated Date - 2023-08-30T19:28:10+05:30 IST