Viral: రూ.6 కోట్ల విలువైన ఈ ఇంటిని.. కేవలం రూ.100 కే అమ్మేస్తున్నారంటే నమ్మలేరు కదూ.. నిజమండీ బాబోయ్.. ఎక్కడంటే..!
ABN, First Publish Date - 2023-09-19T10:03:28+05:30
6కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని కేవలం రూ.100కు అమ్మడం ఎక్కడైనా చూశారా? ఇదేమీ జోక్ కాదు.. అలాగని అవేమీ దయ్యాల కొంపలు అస్సలు కావు. ఇంద్రభవనం లాంటి ఈ ఇళ్ళ వెనుక నిజమిదీ..
పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని పెద్దలు ఓ మాట చెప్పారు. పెళ్లి గురించి ఏమో కానీ ఇల్లు కట్టుకోవడం సగటు పేద, మధ్యతరగతి వారికి చాలా కష్టంతో కూడుకున్నది. ఇక కోట్ల రూపాయల విలువ చేసే ఇంద్రభవనం లాంటి ఇళ్లను కేవలం సినిమాలలో చూసి, ఊహలలో సరిపెట్టుకోవాల్సిందే. కానీ 6కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని కేవలం రూ.100కు అమ్మడం ఎక్కడైనా చూశారా? ఇదేమీ జోక్ కాదు.. అలాగని అవేమీ దయ్యాల కొంపలు అస్సలు కావు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ ఇళ్ళ కథ ఏంటో.. ఇవెక్కడ అమ్ముతున్నారో పూర్తీగా తెలుసుకుంటే..
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. చాలామంది ఏళ్ళకేళ్లు రూపాయి రూపాయి కూడబెట్టి ఆ తరువాత ఓ రెండు గదుల ఇల్లు కట్టుకోవడానికే చాలా కష్టపడుతుంటారు. ఇక బెంగళూరు, హైదరాబాదు, ముంబై లాంటి నగరాల్లో అయితే స్థలం దొరకడమే అరుదు. కోట్ల రూపాయలు సంపాదించేవారు కూడా పెద్ద నగరాల్లో ఇల్లు కొనడంలో విఫలం అవుతుంటారు. కానీ రూ. 6కోట్ల విలువైన ఇంటిని కేవలం 103రూపాయలకు అమ్ముతున్నారు(6crores house sell for 100rupees). అయితే ఇది మన భారతదేశంలో మాత్రం కాదు. ఇంగ్లండ్(England) దేశంలో ఈ వింత జరుగుతోంది. ఇంగ్లాడ్ లో 6.6కోట్ల విలువైన ఇంటిని కేవలం 103రూపాయలకు విక్రయిస్తున్నారు. అయితే ఇవి అందరికీ అందుబాటులో ఉండవు. ఆర్థికంగా ఇల్లు కొనలేక ఇబ్బంది పడుతున్న వారికోసం ఈ ఆఫర్ ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు.
Viral News: బద్దక రత్న అవార్డు కోసం పోటీలట.. గెలిస్తే రూ.88 వేలు ఇస్తారట.. ఇంతకీ రూల్స్ ఏంటో తెలిస్తే..!
ఇంగ్లండ్ లో పేదల కోసం మాత్రమే ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ లో 11 ఇళ్ళు ఉన్నాయి. కార్న్ వాల్ కౌన్సిల్ ఈ ఇళ్ళను ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది. త్రీ సీస్ కమ్యునిటీ ల్యాండ్ అనే ట్రస్ట్ కు ఈ ఇంటి అమ్మకపు భాద్యతలు అప్పజెప్పింది. ఈ ట్రస్ట్ ఇప్పుడు ఈ ఇళ్ల పనులు నిర్వహిస్తోంది. ఇవన్నీ కోస్ట్ గార్డ్ ఫ్లాట్లు. వీటిని బహిరంగ మార్కెట్లో ఎవరికీ అమ్మలేదు. ఇల్లు లేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇబ్బందులు పడుతున్నవారికోసం మాత్రమే ప్రత్యేకంగా వీటిని ఏర్పాటుచేశారు. ఈ ఇళ్లు ఎంత అందంగా ఉన్నాయంటే ఇంద్రభవనాన్ని తలపిస్తున్నాయి. అధునాతనంగా నిర్మించిన ఈ ఇళ్లలో అందమైన పడక గదులతో పాటు ఇంటి చుట్టూ గార్డెనింగ్ తో అద్భుతంగా ఉంది. 6.6కోట్ల విలువైన ఇళ్లు కేవలం 103రూపాయలకు అమ్ముతున్నారు అనే మాట తెలియగానే ఇంగ్లండ్ ప్రజలు వీటిని కొనడానికి పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు. కానీ ఇవి అందరికీ అందుబాటులో ఉండవని తెలియగానే ఊసురుమంటున్నారు.
Marriage Tips: అమ్మాయిలూ.. పెళ్లి చూపుల్లోనే అబ్బాయిని ఈ ప్రశ్న అడిగేయండి.. ఇలా చెప్పినోళ్లనే పెళ్లాడండి..!
Updated Date - 2023-09-19T10:25:00+05:30 IST