ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: జాబ్ కోసం ఇంటర్వ్యూకు వచ్చిన ఓ కుర్రాడి కండీషన్స్ విని అవాక్కైన రిక్రూటర్.. భవిష్యత్తులో ఇలాగే ఉంటుందంటూ..!

ABN, First Publish Date - 2023-07-21T14:27:07+05:30

అప్పటి వరకు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసిన రిక్రూటరే కుర్రాడి డిమాండ్స్ కు అవాక్కయ్యారు. అతని డిమాండ్స్ విన్న నెటిజన్లు అయితే..

ఉద్యోగస్తులను నియమించుకోవడం సంస్థల పని. ఇందులో భాగంగా రిక్రూట్మెంట్లు చేపడుతుంటారు. ఇదే విధంగా ఓ సంస్థ కూడా రిక్రూట్మెంట్ చేపట్టింది. దీనికి ఓ యువకుడు హాజరయ్యాడు.ఇంటర్వ్యూలో అతను రిక్రూటర్ కు తన కండీషన్స్, డిమాండ్స్ చెప్పాడు. అప్పటి వరకు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసిన ఆ రిక్రూటర్ కుర్రాడి డిమాండ్స్ కు అవాక్కయ్యారు. భవష్యత్తులో ఉద్యోగస్తుల డిమాండ్స్ ఇలాగే ఉంటాయేమో అంటూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఫన్నీ సెటైర్లు, పంచులతో స్పందిస్తున్నారు. ఈ సంఘటన గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఇన్ఫోడో(Infeedo) అనే సంస్థ లో పీపుల్స్ సక్సెస్ డైరెక్టర్ గా సమీరా ఖాన్ అనే మహిళ పనిచేస్తున్నారు. అక్కడికి Gen Z కు చెందిన ఓ కుర్రాడు హాజరయ్యాడు. అతను ఇంటర్న్ గా పనిచేయడానికి వచ్చాడు. ఇంటర్యూలో భాగంగా సమీరా ఖాన్ ఆ కుర్రాడిని శాలరీ, తదితర విషయాలలో అతను ఏం ఆశిస్తున్నాడో చెప్పమని అడిగింది. దీంతో ఆ కుర్రాడు తనకు జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ముఖ్యం కాబట్టి రోజుకు 5గంటల కంటే ఎక్కువసేపు పని చేయలేనని చెప్పాడు. ఈ 5గంటల పనికి గానూ తనకు 40-50వేల రూపాయల నెలవారీ జీతం కావాలని అడిగాడు(40-50k/month). పైగా తనకు MNC సంస్థలంటే నచ్చదని, తనకు స్టార్టప్ లో ఉద్యోగం కావాలని చెప్పాడు. ఈ విషయాలు వినగానే సంస్థ డైరెక్టర్ సమీరా ఖాన్ అవాక్కైంది. జరిగిన సంఘటనను మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. భవిష్యత్తులో ఉద్యోగస్తుల డిమాండ్స్ ఇలాగే ఉంటాయేమో ఆ దేవుడే పని భవిష్యత్తును నిర్ణయిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది.

Viral Video: ఎంతయినా ఇంజనీర్లు కదా.. మారుతీ కారు టాప్‌ను తీసేసి.. దాన్ని ఎలా మార్చేశారో మీరే చూడండి..!


ఈ విషయాన్ని ఇన్ఫోడో డైరెక్టర్ సమీరా Sameera తన ట్వి్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఇది చూసి పలువురు పంచులతోనూ, సెటైర్లతోనూ స్పందిస్తున్నారు. 'ఏంటీ స్టార్టప్ లో రోజుకు 5గంటలు పని చేయాలని చూస్తున్నారా? కూల్.. కూల్..'అని ఒకరు ఇంటర్వ్యూకు హాజరైన సదరు కుర్రాడిది అత్యాశ అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. 'అతను 5ఏళ్ళపాటు వారానికి 100గంటన చొప్పున పనిచేసి పెద్ద టెక్ సంస్థలో మంచి స్థాయికి చేరుకోవాలి. అప్పుడు అతను కోరుకున్నట్టు 5గంటల కంటే తక్కువ సమయమే పనిచేసినా 40-50లక్షల ప్యాకేజీ వస్తుంది'అని మంచి శాలరీతో ఉద్యోగాలంటే మొదట ఎంత కష్టపడాలో చెప్పాడు. 'ఒకవేళ అతను ఈ డిమాండ్స్ తో ఉద్యోగంలో చేరినా 3నెలల తరువాత నేను ఈ ఉద్యోగాన్ని ఎంజాయ్ చేయడం లేదు అని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు' అని మరొకరు పంచ్ వేశారు.

Heavy Rains Effect: అమ్మ బాబోయ్.. వర్షాల ప్రభావం ఈ రేంజ్‌లో ఉందేంటి..? రోడ్డు మీదకు వచ్చిన మొసలి ఏం చేస్తోందంటే..!


Updated Date - 2023-07-21T14:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising