Viral: ఏమండోయ్.. ఇది విన్నారా..? ఈ రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత.. కాసేపు కునుకు తీసేందుకు ప్రత్యేక ఏర్పాటు..!
ABN, First Publish Date - 2023-07-25T10:12:00+05:30
స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో రెస్టారెంట్లకు, హోటల్స్ కు వెళ్ళినప్పుడు ఒకటికి నాలుగు రకాలు తింటాం. ఇలా తిన్నప్పుడు 'అబ్బా కాసేపు నిద్రపోతే ఎంత బాగుంటుందో' అని అనిపిస్తుంది. వేరే ఎక్కడా సాధ్యపడదు కానీ ఈ రెస్టారెంట్లో అయితే ఎంచక్కా నిద్రపోవచ్చు..
ఇంట్లో అయినా ఆఫీసులో అయినా మంచి భోజనం చేశామంటే కునుకు తీయాలని అనిపిస్తుంది. ఇక స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో రెస్టారెంట్లకు, హోటల్స్ కు వెళ్ళినప్పుడు ఒకటికి నాలుగు రకాలు తింటాం. ఇలా తిన్నప్పుడు కూడా 'అబ్బా కాసేపు నిద్రపోతే ఎంత బాగుంటుందో' అని అనిపిస్తుంది. అయితే ఇంటికెళ్ళే వరకు ఆ పని చేయడం కుదరదు. కానీ ఓ రెస్టారెంట్ మాత్రం హాయిగా తిని ఇక్కడే నిద్రపోండి' అని చెబుతోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగానూ, అతిశయంగానూ ఉండవచ్చు. కానీ ఇది నిజం. ఇంతకీ ఈ విచిత్రమైన రెస్టారెంట్ ఎక్కడుంది? ఈ రూల్ పెట్టడానికి గల కారణమేంటి? అనే విషయాలు తెలుసుకుంటే..
భారీ ఆహారాలు(heavy foods) తిన్నప్పుడు నిద్రముంచుకొస్తుంది. ముఖ్యంగా కొవ్వులు ఎక్కువ కలిగిన ఆహారం తిన్నప్పుడు ఇలాగే జరుగుతుంది. జోర్దాన్(Jordan) దేశ రాజధాని అమ్మన్ లో ఓ రెస్టారెంట్ వినూత్నంగా ఆలోచించింది. దీని ప్రకారం జోర్దాన్ జాతీయ వంటకాన్ని తిన్నవారు అదే రెస్టారెంట్లో హాయిగా నిద్రపోవచ్చు. ఇందుకు గానూ ఈ రెస్టారెంట్ స్వయంగా తన కస్టమర్ల కోసం గదులను కూడా ఏర్పాటు చేసింది. జోర్దాన్ జాతీయ వంటకం పేరు మన్సాఫ్(Jordan national food mansaf). ఈ వంటకం మాములుది కాదు. చాలా ఎక్కువ కొవ్వులతో కూడుకుని ఉంటుంది. గొర్రె మాంసం(lamb meat), నెయ్యి(ghee), బియ్యం(rice) కలిపి వండే ఈ వంటకం తిన్న తరువాత ప్రజలు చాలా భీభత్సంగా నిద్రపోతారట. ఈ కారణంగా చాలా ఏళ్ళ నుండి ప్రజలు తంటాలు పడి ఈ వంటకాన్ని ఇళ్ళలోనే వండుకునేవారట. కానీ రెస్టారెంట్ రుచి ప్రజలను బాగా ఆకర్షించింది. అయితే రెస్టారెంట్లో ఈ వంటకం తింటే నిద్ర సమస్య వేధించేది.
Wife Video: సరుకులు తీసుకునేందుకని వెళ్లి.. భార్యకు భారీ షాకిచ్చాడుగా.. భర్త ఫోన్ చేశాడని ఇంటి బయటకు వచ్చి చూస్తే..!
ఈ రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లలో మన్సాఫ్ వంటకం తిన్నవారు అప్పుడప్పుడు రెస్టారెంట్లో పడకలు ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది అని ఫన్నీగా చెప్పేవారట. దీంతో రెస్టారెంట్ లో మంచాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన కస్టమర్ల మాటల్లోనే పుట్టింది. దీంతో ఇక్కడి ఫర్నిచర్ లో భాగంగా పడకలు ఏర్పాటు చేశారు. ఆ తరువాత సాధారణ గదులే కాదండోయ్, ఎయిర్ కండీషన్డ్ బెడ్ రూమ్ లు కూడా ఏర్పాటు చేశారు. 'మా రెస్టారెంట్ కు వచ్చి మన్సాఫ్ వంటకం తిన్నవారు హాయిగా ఇక్కడే నిద్రపోయి తరువాత వెళ్ళచ్చు' (Restaurant arrange sleeping facility) అని ఈ రెస్టారెంట్ యజమాని కుమారుడు ముసాబ్ ముబెదిన్ స్వయంగా చెప్పాడు. ఆహారాన్ని, నిద్రను ప్రేమించేవాళ్ళకు ఈ వార్త తెగ నచ్చేస్తోంది.
Viral Video: ఇతడికేమైనా అద్భుత శక్తులున్నాయా ఏంటీ..? నీళ్లపై ఇలా పడుకున్నా అస్సలు మునగడం లేదేంటి..?
Updated Date - 2023-07-25T10:12:00+05:30 IST