Viral News: 80 ఏళ్ల క్రితం నాటి అయిదో తరగతి ప్రశ్నాపత్రం.. ఒక్క ప్రశ్నకయినా సమాధానం చెప్పగలిగితే చాలా గ్రేట్ అట..!
ABN, First Publish Date - 2023-05-04T14:37:54+05:30
80ఏళ్ళ క్రితం అయిదో తరగతి ప్రశ్నాపత్రం చూశారంటే మాత్రం దిమ్మతిరిగి బొమ్మ కనడుతుంది. ఇంతకూ అందులో ఏముంది? దాన్ని చూసి అందరూ ఎందుకు చేతులెత్తేస్తున్నారు?
అయిదో తరగతి ప్రశ్నాపత్రం ఎలా ఉంటుంది? కూడికలు, తీసివేతలు, భాగాహారాలు వీటితో పాటు మరికొన్ని సమస్యలు ఉంటాయి. సాధారణ పాఠశాలా లేక కార్పోరేట్ పాఠశాలా అనేదాన్ని బట్టి ఇందులో కాస్త మార్పులు ఉండొచ్చు. కానీ 80ఏళ్ళ క్రితం అయిదో తరగతి ప్రశ్నాపత్రం చూశారంటే మాత్రం దిమ్మతిరిగి బొమ్మ కనడుతుంది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు అయిదో తరగతి ప్రశ్నాపత్రమిదేనంటూ ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకూ అందులో ఏముంది? దాన్ని చూసి అందరూ ఎందుకు చేతులెత్తేస్తున్నారు పూర్తీగా తెలుసుకుంటే..
50ఏళ్ళ కిందట హోటల్లో ఆహారపదార్థాల ధరలు ఇవే.. అంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అయ్యింది. దాన్ని చూసి ఇప్పటికాలం కుర్రకారు కాస్త షాకై ఉంటారు. ఇప్పుడు అలానే ఓ ఫోటో వైరల్ అవుతోంది. 80ఏళ్ళ కిందట అయిదో తరగతి ప్రశ్నాపత్రాన్ని(80years back fifth class question paper) ఓ రిటైర్డ్ ఐఏఎస్(Retired IAS officer) అధికారి షేర్ చేశారు. ఆ ప్రశ్నాపత్రం 1943-44 సంవత్సరం(1943-44 year question paper) నాటిది. సమాధానాలు రాయడానికి ఇచ్చిన గడువు రెండు గంటలా ముప్పై నిముషాలు. 'ఓస్.. అయిదో తరగతి ప్రశ్నాపత్రమా అప్పటికాలానికి తగ్గట్టు అక్షరాలు, పదాలు, అంకెలు, సంఖ్యలు ఉండచ్చేమో' అనుకుంటారేమో. కానీ అస్సలు కాదండోయ్.. అందులో ప్రశ్నలు చూసి అందరూ ఖంగుతింటున్నారు. అయిదో తరగతికే అప్పట్లో కామర్స్ సబ్జెక్ ఉంది(commerce subject in fifth class). కామర్స్ ప్రశ్నాపత్రం కావడంతో అందులో బంగారం ధర నుండి కాగితం ధర వరకు బోలెడు ప్రశ్నలు వచ్చాయి. ఇందులో ఓ ప్రశ్న ఇలా ఉంది.. 'రాముడి ఇంట్లో ప్రతి రోజూ పిండి ఖర్చు అవుతుంది అయితే.. 2సంవత్సరాల 3నెలల 18రోజుల్లో ఎంత ఖర్చు చేస్తారు?' అని అడిగారు. కాగా ప్రశ్న మధ్యలో కొన్ని గీతలతో కలిసిన సింబల్స్(symbols with lines) ఉండటంతో ప్రశ్న పూర్తీగా అర్థం కాలేదు. దీని తరువాత 'మార్కెట్ ధరను కోరుతూ వ్యాపారికి లేఖ రాయండి' అనే ప్రశ్న కూడా ఇచ్చారు. అయితే వీటన్నికంటే కూడా ఈ ప్రశ్నాపత్రంలో కష్టమైన విషయం, ఎవరికీ అర్థం కాని విషయం ప్రశ్నల మధ్య ఉన్న సింబల్స్. చాలామంది ప్రశ్నల మధ్య సింబల్స్ కు అర్థమేంటో తెలియక జుట్టు పీక్కున్నారు.
Viral News: పాత ఇంటిని కూల్చేస్తోంటే.. గోడల్లో బయటపడిన రూ.50 లక్షల నోట్ల కట్టలు.. ఆనందంతో ఎగిరిగంతేశాడు కానీ.. చివరకు..
Badri Lal Swaenkar IAS (Retired) అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ ప్రశ్నాపత్రాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. కాగా దీన్ని చూసిన ఓ వ్యక్తి ప్రశ్నల మధ్యలో ఉన్న సింబల్స్ కు అర్థం ఇదేనంటూ కామెంట్ చేశాడు. ప్రశ్న మధ్యలో ఉన్న రెండు క్షితిజ సమాంతర రేఖలు రెండు అణాలు, రెండు నిలువు వరుసలు ఎనిమిది అణాలు, ఇందులో ఒక లైన్ నాలుగు అణాలను సూచిస్తాయని అతను పేర్కొన్నాడు. ఇది తెలిశాక ప్రశ్నలను అర్థం చేసుకోవడం సులువయ్యింది. కాగా 'అయిదో తరగతికే ఇంత కఠినమైన ప్రశ్నాపత్రం ఏంటి బాబోయ్' అని దీన్ని చూసినవారు కళ్ళు తేలేస్తున్నారు.
Man with Woman Voice: పుట్టుకతోనే అమ్మాయి గొంతు.. మగాడివి కాదంటూ అంతా హేళన చేసినా.. ఈ కుర్రాడు ఇప్పుడేం చేస్తున్నాడంటే..
Updated Date - 2023-05-04T15:12:04+05:30 IST