ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: ఈ ఫొటోలోని యువతి తండ్రికి ఏకంగా రూ.24,980 కోట్ల ఆస్తి.. అయినా ఈమె ప్రస్తుతం ఏం చేస్తోందో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-10-16T15:45:34+05:30

చాలావరకు ధనవంతుల పిల్లలు తమ తల్లిదండ్రులు, అవ్వతాతలు సంపాదించిన ఆస్తులు, వారు నెలకొల్పిన వ్యాపారాలు చూసుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపేస్తారు. కానీ ఈమె మాత్రం అలా కాదు..

చాలావరకు ధనవంతుల పిల్లలు తమ తల్లిదండ్రులు, అవ్వతాతలు సంపాదించిన ఆస్తులు, వారు నెలకొల్పిన వ్యాపారాలు చూసుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపేస్తారు. కానీ కొందరు మాత్రం తమ సొంత కాళ్ళ మీద నిలబడాలని, తామెంటో ప్రూవ్ చేసుకోవాలని, తమ గుర్తింపు తాము సంపాదించుకోవాలని అనుకుంటారు. అలాంటివారు తమకు వారసత్వంగా చేతికి వచ్చే ఆస్తిని తోసిపుచ్చి మరీ సొంతంగా జీనితాన్ని నిర్మించుకుంటారు. నైరికా కూడా అలాంటి యువతే.. ఈమె తండ్రికి ఒకటి రెండు కాదు ఏకంగా 24,980కోట్ల ఆస్తి ఉన్నా దాన్ని కాదనుకుని సొంతంగా సంపాదన వేట ప్రారంభించింది. ఆమె ఇప్పుడు ఏం చేస్తోందో తెలిస్తే షాకవుతారు. ఈమె గురించి పూర్తీగా తెలుసుకుంటే..

జీవితంలో నిరంతరం నిజాయితీగీ పనిచేయాలని తపించేవారే ఎప్పటికైనా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. నైరికా హోల్కర్(nyrika holjer) అలాంటి యువతే.. ఈమె తండ్రి విజయ్ కృష్ణ ప్రముఖ నాటక రంగ నటుడు. ఈయన గోద్రెజ్(Godrej) కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జంషీద్ గోద్రెజ్(Jamshyd Godrej) చెల్లెలు స్మితను వివాహం చేసుకున్నారు. స్మిత, విజయ్ కృష్ణల కుమార్తెనే నైరికా హోల్కర్. నైరికా హోల్కర్ అమెరికాలోని కొలరాడో కాలేజీ నుండి ఫిలాసఫీ, ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్ పొందింది. యుకే లోని యూనివర్సిటీ ఆప్ లండన్ నుండి LL.B, LL.M డిగ్రీలు కూడా సాధీంచింది. బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా ఉంది. న్యాయవిభాగంలో ఈమెకు ఉన్న ప్రతిభ కారణంగా నైరికా తన తల్లిదండ్రుల ఆస్తి మీద ఆధారపడకుండా తన మేనమామ కంపెనీ అయిన గోద్రెజ్& బోయ్స్ లో చేరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(executive director) గా విధులు నిర్వహిస్తోంది. 125సంవత్సరాల చరిత్ర కలిగిన గోద్రేజ్ కంపెనీ ప్రస్తుతం రూ. 47, 460కోట్ల విలువ కలిగి ఉంది.

Wife-Husband: భార్యపై నిఘా.. సీక్రెట్‌గా ఆమె ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేశాడో భర్త.. చివరకు హైకోర్టు ఏం తేల్చిందంటే..!


నైరిక యశ్వంత్ హోల్కర్(Yashwanth holker) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈమె కేవలం న్యాయశాస్త్రంలో ప్రావీణ్యురాలే కాదు యోగా ప్రాక్టీషనర్, రన్నర్. చదవడం, హైకింగ్, ఫోటోగ్రఫీ వంటి తదితర అభిరుచులు ఈమె సొంతం. ఈమె తన కెరీర్ ను మొదట AZB& పార్ట్నర్స్ లో ప్రారంభించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని అనుకునే విదేశీ కంపెనీలకు సలహా ఇవ్వడం, కంపెనీల విలీనాలు, స్వాదీనం చేసుకునే విధానాలకు సంబంధించి మంచి నైపుణ్యం పొందారు. గోద్రెజ్&బోయ్స్ దాని అనుబంద సంస్థల కోసం డిజిటల్ వ్యూహాలు, లీగల్ విషయాలు, బ్రాండ్ మొదలైన వర్గాలను ఈమె నిర్వహిస్తుంది. గోద్రెజ్ కంపెనీ ప్రజల్లోకి మరింతగా వ్యాప్తి కావడానికి కృషి చేస్తున్నారు.

Travelers: తరచూ ప్రయాణాలు చేసే అలవాటు ఉన్న వాళ్లు.. ఈ 10 వస్తువులను మాత్రం అస్సలు మర్చిపోరట..!


Updated Date - 2023-10-16T15:45:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising