ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: అయ్యా.. నా కూతురు పది పాస్ అయిందంటూ సంతోషాన్ని పంచుకుందో పనిమనిషి.. ఆ యజమాని ఏం చేశారో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-06-07T15:54:38+05:30

తల్లిదండ్రులు పిల్లలనుచూసి సంతోషించే సందర్భం ఏదైనా ఉందంటే అది పిల్లల చదువు విషయమే. పిల్లలు ఎంత బాగా చదివితే పేరెంట్స్ కు అంత సంతోషం. పనిమనిషిగా బ్రతుకీడుస్తోన్న ఓ మహిళ తను పనిచేసే ఇంటికి వెళ్ళి నాకూతురు పాసైందని చెప్పగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లిదండ్రులు పిల్లలనుచూసి సంతోషించే సందర్భం ఏదైనా ఉందంటే అది పిల్లల చదువు విషయమే. పిల్లలు ఎంత బాగాచదివితే పేరెంట్స్ కు అంత సంతోషం. ఇక పరీక్షల్లో పిల్లలు పాసైతే తల్లిదండ్రుల సంతోషం వర్ణణాతీతం. పేదింటి పిల్లలు చదువులో రాణిస్తే ఆ పిల్లల తల్లిదండ్రులు గర్వంగా ఫీలవుతారు. ఓ మహిళ ఇళ్ళలో పాచిపని చేసుకుంటూ తన కూతురుని చదివిస్తోంది. తల్లి కష్టానికి ఫలితంగా ఆ పాప కూడా బాగా చదివింది. ఆ పాప పదవ తరగతి పాసవడంతో ఆ పాప తల్లి చెప్పలేనంత సంతోషించింది. తను పనిచేసే ఇంటికెళ్ళి 'నా కూతురు పాసైంది సార్' అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. ఆ మాట వినగానే ఆ ఇంటి యజమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకివెళితే..

పిల్లలు చదువులో రాణిస్తున్నారంటే(kids excelling in studies) ప్రతి తల్లిదండ్రికి సంతోషమే. ఉత్కర్ష్ గుప్తా అనే వ్యక్తి ఇంట్లో ఓ మహిళ పనిచేస్తోంది. ఆమె ఎప్పటిలా పనిచేయడానికి అతని ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్ళగానే ఆమె తనతో తీసుకొచ్చిన రెండు మామిడి పళ్ళు ఇంట్లో వారికి ఇచ్చి 'నా కూతురు పదవ తరగతి పాసైంది సార్(maid daughter passed 10th class)' అని చెప్పింది. ఆమె సంతోషం చూసి వారికి చాలా సంతోషమేసింది. వెంటనే ఉత్కర్ష్ గుప్తా తన ట్విట్టర్ అకౌంట్ లో ఆ రెండు మామిడిపళ్ళ ఫోటోను, తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు.

ఈ విషయాన్ని Utkarsh Gupta అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ప్రజలు వారి సంతోషంలో మనల్ని చేర్చుకున్నప్పుడు ఎంతబాగుంటుందో' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ పోస్ట్ చూసినవారు పలువిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'సంతోషాన్ని పంచుకోవడానికి ఖరీదైనవే అక్కర్లేదు మంచి మనసుంటే చాలు' అని కామెంట్స్ చేస్తున్నారు. 'మామిడిపండ్లలాగే ఆ మహిళ మనసు చాలా తియ్యనైనది' అని అంటున్నారు. 'ఇలాంటి సంతోషాలు కేవలం భారతదేశంలోనే చూడగలం, నేను విదేశాల్లో ఉండటం వల్ల ఇలాంటివి మిస్ అవుతున్నాను' అని విదేశాల్లో ఉన్న ఓ భారతీయుడు కామెంట్ చేశాడు. 'ఆ పాప చదువులో మరెన్నో విజయాలు సాధించాలి' అని మరికొంందరు స్పందించారు.

Viral Video: వామ్మో పిల్లులకు ఇంత ధైర్యం ఉంటుందా? ఈ వీడియో చూశారంటే షాకవడం పక్కా..


Updated Date - 2023-06-07T15:54:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising