Viral News: ఈ రెండున్నరేళ్ల పాపకు అద్భుత శక్తులున్నాయా..? ఎలా బతికిందంటూ అంతా ఆశ్చర్యం.. క్రూర మృగాలున్న అడవిలో 4 రోజుల పాటు..
ABN, First Publish Date - 2023-05-16T15:43:43+05:30
అసలే సింహాలు, పులులు సంచరించే దట్టమైన అడవి, దానికి తోడు తిండీ నీళ్ళు లేవు.. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు రోజుల పాటు ఈ పాప..
అడవి పేరు చెబితే వెంటనే క్రూరమృగాలు గుర్తులు వస్తాయి. పెద్ద అడవి అయితే సింహాలు, పులులు, తోడేళ్లు, ప్రమాదకరమైన విషసర్పాలు ఇలా చాలానే ఉంటాయి. వీటిమధ్య గడపడానికి పెద్దవాళ్లే భయపడతారు. కానీ రెండున్నరేళ్ళ చిన్నారి పగలూ రాత్రి తేడా లేకుండా నాలుగురోజుల పాటు అడవిలో ఉంది. నాలుగురోజుల తరువాత క్షేమంగా కనిపించింది. 'ఈ పాపకు ఏమైనా అద్బుత శక్తులు ఉన్నాయా? ఒక్కరోజు తిండిలేకపోతే పెద్దవాళ్లే నీరసపడిపోతారు. అలాంటిది ఈ పాప నాలుగురోజులు ఎలా ఉందో ఏంటో..' అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటన గురించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..
కర్ణాటక(Karnataka) రాష్ట్రం బెలగావి(Belagavi) జిల్లాలో ఖానాపూర్ అనే గ్రామముంది. ఈ గ్రామంలో నివసిస్తున్న అదితి అనే రెండున్నరేళ్ళ బాలిక(two and half year girl) ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదితి తల్లిదండ్రులు పని నిమిత్తం వేరే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళారు. వారు వెళుతూ రెండన్నరేళ్ళ అదితిని ఇంటిదగ్గరే వదిలేసి వెళ్ళారు. అదితి ఆడుకుంటూ గ్రామానికి దగ్గర్లో ఉన్న అడవిలోకి వెళ్ళింది. ఆ పాపను ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత అదితి తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చి చూస్తే అదితి కనిపించలేదు. ఎక్కడైనా ఆడుకుంటోందేమేనని ఊరంతా వెతికారు కానీ జాడ లేదు. దీంతో అదితి తప్పింపోయిందని అర్థం చేసుకున్నారు. పాపను చెట్టుకింద చూశామని కొందరు, ఆడుకుంటూ కనిపించిందని మరికొందరు చెప్పడంతో ఆ ప్రాంతాలను గర్తుపడుతూ వెళ్ళగా అది ఊరి పొలిమేరకు దారితీసింది. దీంతో అదితి ఊరికి ఆనుకుని ఉన్న అడవిలోకి వెళ్ళిందని అర్థమైంది. ఆ అడవిలో పులులు, సింహాలు(Tigers, Lions) సంచరిస్తూ ఉంటాయని పెద్దలెవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్ళరు. అదితిని వెతకడానికి యువకులు జట్లుగా ఏర్పడి అడవిలోకి వెళ్ళారు. అడవిలో ఎంత వెతికినా వారికి అదితి కనిపించలేదు. నాలుగు రోజులు గడిచినా పాప దొరకకపోవడంతో ఆ పాప ఏ జంతువుకో ఆహారం అయిపోయి ఉంటుందని అందరూ అనుకున్నారు.
పేస్టు.. టూత్ బ్రష్ ఎక్కడ పెడుతుంటారు? బాత్రూమ్ లోనా? బయటా? తెలియకుండానే ఎంత పెద్ద తప్పు చేసేస్తున్నారో..
నాలుగు రోజుల తరువాత కొంతమంది యువకులు నడుచుకుంటూ వెళుతుండగా ఇంటికి 1.5కి.మీ దూరంలో అదితి అపస్మారక స్థితిలో పడి ఉండటం చూశారు. వారు వెంటనే ఆ పాపను తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్ళారు. పాప నీరసంతో స్పృహ తప్పి పడిపోయినట్టు తెలిసింది. శరీరం మీద ఎక్కడా చిన్న గాయం కూడా లేదు. అక్కడక్కడా దోమలు కుట్టిన జాడలు తప్ప ఇంకేమీ లేవు. దీంతో పాప తల్లిదండ్రులకు పోయిన ప్రాణం లేచొచ్చనట్టయ్యింది. నాలుగురోజుల పాటు తిండి, నీళ్లు లేకుండా ఆ పాప ఎలా ఉందో.. కృూరమైన జంతువుల మధ్య ఎలా తిరిగిందో అర్థం కావడం లేదంటూ అందరూ అయోమయానికి గురవుతున్నారు. 'ఆ పాపకు ఏమైనా అతీంద్రీయ శక్తులున్నాయా అంత దట్టమైన అడవిలోకి వెళ్ళి మరీ క్షేమంగా ఇంటికి చేరుకుంది' అని ఆశ్చర్యపోతున్నారు.
Crime News: ఇంటిని శుభ్రం చేస్తుండగా బెడ్రూంలో బయటపడిన సీక్రెట్ కెమెరా.. అసలు దాన్ని ఎవరు పెట్టారో తెలిసి అంతా షాక్.. చివరకు..!
Updated Date - 2023-05-16T15:43:43+05:30 IST