ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: తల్లి నుంచి మెసేజ్.. ఆఫీసులో మీటింగ్‌లో ఉన్నా.. ఏమైనా అర్జెంటా..? అని ఆ కొడుకు అడిగితే తల్లి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి..

ABN, First Publish Date - 2023-04-20T20:40:36+05:30

'ఇది మా అమ్మ నేను ఆఫీసు మీటింగ్ లో ఉన్నప్పుడు నాకు పంపిన మెసేజ్' అంటూ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో తన వాట్సాప్ చాట్ షేర్ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మగవాళ్ళు ఆఫీసుల్లో ఉన్నప్పుడు భార్యో, తల్లో లేక పిల్లలో ఫోన్లు చేస్తుంటారు. ఇంటికి అవసరమైనవి తీసుకురమ్మని చెప్పడమో.. లేక బయటకు వెళ్లే పని ఉంటే తొందరగా ఇంటికి రమ్మని చెప్పడమో చేస్తుంటారు. ఓ వ్యక్తికి తను ఆఫీసులో మీటింగ్ లో ఉన్న సమయంలో సరిగ్గా అతని తల్లి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. 'నేను మీటింగ్ లో ఉన్నానమ్మా ఏదైనా అర్జెంటా?' అని ఆ కొడుకు రిప్లయ్ ఇచ్చాడు. దానికి ఆ తల్లి ఇచ్చిన రెస్పాన్స్ చర్చనీయాంశంగా మారింది. 'ఇది మా అమ్మ నేను ఆఫీసు మీటింగ్ లో ఉన్నప్పుడు నాకు పంపిన మెసేజ్' అంటూ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో తన వాట్సాప్ చాట్ షేర్ చేశాడు. సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

'ఇంట్లో పెరుగు లేదు..ఆఫీసు నుండి ఇంటికి వచ్చేటప్పుడు తీసుకుని రండి..', ' పిల్లాడు ఐస్ క్రీమ్ కావాలని గోల చేస్తున్నాడు వచ్చేటప్పుడు తీసుకురండి' సగటు భార్యలు భర్తలకు పెట్టే మెసేజ్ లు, ఫోన్ కాల్ సారాంశాలు చాలావరకు ఇలానే ఉంటాయి. అయితే తల్లులు మాత్రం దీనికి విభిన్నంగా ఉంటారు. 'ఒరేయ్ నాన్నా.. ఆఫీసు పనిలో పడి లంచ్ చేశావా లేదా?' 'ఆఫీసు ఇంకా అయిపోలేదా చీకటి పడకముందే ఇంటికి వచ్చెయ్' సగటు తల్లులకు కొడుకుల మీద ప్రేమ ఇలాగుంటుంది. ఓ తల్లి తన కొడుకుకు 'ఏం చేస్తున్నావురా కన్నా..' అంటూ వాట్సప్ మెసేజ్(Mother WhatsApp message) చేసింది. 'అమ్మా ఆఫీసులో మీటింగ్ లో ఉన్నాను, ఏదైనా అర్జెంటా?' అని అతను తల్లికి రిప్లయ్ ఇచ్చాడు. సహజంగా అయితే 'ఎప్పుడూ మీటింగులనీ.. ముఖ్యమైన పనులనీ అంటూనే ఉంటారు, ఓ నిమిషం మాట్లాడితే ఏమవుతుందట?' అని అలుగుతారు కొందరు తల్లులు. కానీ ఈ తల్లి మాత్రం తన కొడుకు పరిస్థితి అర్థం చేసుకుంది. 'నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను.. కేవలం నీకు ఐ లవ్యూ(just wanted to say I LOVE YOU) చెబుదామని చేశాను అంతే' అని రిప్లయ్ ఇచ్చింది. ఆ ఒక్క మెసేజ్ ఆ తల్లికి తన కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో అర్థమయ్యేలా చేస్తోంది. పిల్లలు ఎంత పెద్దయినా తల్లికి చిన్నపిల్లల్లాగే అనిపిస్తారంటే ఇదేనేమో.. ఆ తల్లి ఇచ్చిన రిప్లయ్ చూసి అతని మనసు సంతోషంతో నిండిపోయింది.

Viral Video: నిజమైన హీరోవంటే నువ్వేనయ్యా.. ఒంటె ఓ గొయ్యిలోకి తొంగి చూస్తోందేంటని ఈ వ్యక్తికి అనుమానం వచ్చి వెళ్లి చూస్తే..


Rishik Suri అనే ట్విట్టర్ అకౌంట్(Twitter) నుండి ఈ చాటింగ్ స్కీన్ షాట్(Chatting screen shot) ను షేర్ చేశారు. ఈ పోస్ట్ ను గమనిస్తే ఆ సందేశం రిషిక్ అనే వ్యక్తికి తన తల్లి నుండి వచ్చినట్టు అర్థమవుతోంది. ట్విట్టర్ పోస్ట్ కు అనుబంధంగా ' లవ్ మై మదర్ సో మచ్'(love my mother so much) అని క్యాప్షన్ పెట్టారు. ఈ స్క్రీన్ షాట్ చూసిన నెటిజన్లు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. 'తల్లి ప్రేమను అంతగా పొందుతున్న అతను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని ఒకరు కామెంట్ చేశారు.' అతను తల్లి నుండి అందుకున్న అత్యంత విలువైన బహుమతి ఇది' అని మరొకరు అన్నారు. ఈ పోస్ట్ కు అందరి నుండి చాలా పాజిటివ్ కామెంట్సే వచ్చాయి. 'అమ్మ ప్రేమ ఎప్పుడూ గొప్పదే' అని నెటిజన్లు నొక్కివక్కాణిస్తున్నారు.

Viral Video: సైకిల్‌పై వీధుల్లో తిరుగుతూ సమోసాలు అమ్ముతున్న వికలాంగుడు.. ఇంగ్లీషులోనూ మాట్లాడుతోంటే అనుమానం వచ్చి ఓ వ్యక్తి ఆరా తీస్తే..


Updated Date - 2023-04-20T20:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising