ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ప్రేమకు వయసు అడ్డంకి కాదనుకున్నారు వాళ్ళు.. తల్లీకొడుకుల్లా ఉన్నారని ఎగతాళి చేస్తున్న ఇరుగు పొరుగు.. వీరి కథేంటంటే..

ABN, First Publish Date - 2023-02-06T13:54:17+05:30

తమది దేవుడు కలిపిన బంధం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇరుగు పొరుగు మాత్రం మీరిద్దరూ తల్లీకొడుకుల్లా ఉన్నారంటూ వారిని చూసి హేళన చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్మాయి అబ్బాయికంటే వయసులో పెద్దది అనే ప్రస్తావన వస్తే, నాటి రాముడు-సీత నుండి నేడు సచిన్ టెండుల్కర్- అంజలి వరకు ఉదాహరణ చెబుతారు. అయితే తమ చుట్టూ అలాంటివి జరిగినప్పుడు మాత్రం బుగ్గలు నొక్కుకుని ఎగతాళిగా మాట్లాడతారు. 54ఏళ్ళ మహిళ, 25ఏళ్ళ అబ్బాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు, వారిద్దరూ పెళ్ళిపీటలు ఎక్కబోతున్నారు. తమది దేవుడు కలిపిన బంధం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇరుగు పొరుగు మాత్రం మీరిద్దరూ తల్లీకొడుకుల్లా ఉన్నారంటూ వారిని చూసి హేళన చేస్తున్నారు. వీరికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఇంగ్లండ్ దేశానికి చెందిన 54ఏళ్ళ స్టెప్ అనే మహిళ, 25ఏళ్ళ లూకె అనే కుర్రాడు ఇద్దరూ ఫేస్ బుక్ లో పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ మొదట ఫేస్ బుక్ లో చాట్ చేసుకున్నారు. ఆ తరువాత నేరుగా కలుసుకున్నారు. మొదటిచూపులోనే వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చేసారట. దాంతో వారు ప్రేమలో పడ్డారు.స్టెఫ్ కు నలుగురు పిల్లలున్నారు, భర్త లేడు. ఆవిషయం తెలిసీ లూకె ఆమెను ప్రేమించాడు. దాదాపు ఆరునెలలు ప్రేమ సాగిన తరువాత ఈమధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరినీ చూసిన ఇరుగు పొరుగు 'మీరిద్దరూ తల్లీకొడుకుల్లా ఉన్నారు' అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాళ్ళు మాత్రం ఈ ఏడాదిలో పెళ్ళిపీటలెక్కబోతున్నారట. 'నలుగురు పిల్లలకు తల్లి అయినా నాకు ఎలాంటి సమస్యా లేదు. ఆమె మనసు చాలా అందమైనది, అలాగే ఆమె ప్రేమ గొప్పది. అందుకే మేమిద్దరం పెళ్ళిచేసుకోబోతున్నాం' అని లూకె చెప్పాడు. వీళ్ళిద్దరి గురించి విన్న నెటిజన్లు 'వాళ్ళకు లేని సమస్య చుట్టుప్రక్కల వారికి ఎందుకు? వాళ్ళను సంతోషంగా ఉండనియ్యండి' అంటున్నారు

Updated Date - 2023-02-06T13:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising