ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద మనసు తల్లీ.. 5 ఏళ్ల ఈ పాప ఎందుకిలా జుట్టునంతా తీసేయించిందంటే..!

ABN, First Publish Date - 2023-09-28T10:02:27+05:30

కొన్ని సందర్బాలలో పిల్లల చర్య పెద్దలను కూడా ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు ఒక 5ఏళ్ళ పాప తన పెద్ద మనసు చాటుకుంది.

పిల్లలు తమకు కావలసింది దక్కించుకునేవరకు నిద్రపోరు, బాగా అల్లరి చేస్తారు. తల్లిదండ్రుులు ఒక్క నిమిషం వారిని కంట కనిపెట్టకపోతే ఇల్లు పీకి పందిరేస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరొక కోణంలో పిల్లలలో దైవత్వం ఉంటుంది. మంచి చెడు అనే తేడా లేకుండా వారు అందరితో ప్రేమగా ఉంటారు. కొన్ని సందర్బాలలో పిల్లల చర్య పెద్దలను కూడా ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు ఒక 5ఏళ్ళ పాప తన పెద్ద మనసు చాటుకుంది. 5ఏళ్లకే ఎంతో పొడవుగా పెరిగిన తన జుట్టు మొత్తాన్ని తీసేయించింది. ఇదేదో దేవుడి మొక్కు కోసమో.. ఆ పాపకు ఏదైనా అనారోగ్యమో ఉండి ఆ పని చేయలేదు. ఆ పాప అలా జుట్టు తీయడం వెనుక గల కారణం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద మనసు తల్లీ నీది' అని ప్రశంసిస్తున్నారు. ఈ పాప ఎవరు? తన జుట్టును అలా తీసేయించడానికి గల కారణం ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేషంట్ లకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తమ భాగస్వాములకు క్యాన్సర్ సోకి జుట్టంతా పోతోంటే ముందుగానే వారి జుట్టు తొలగించి, తాము జుట్టు తొలగించుకుంటున్న వీడియోలు గుండె బరువెక్కిస్తున్నాయి. అయితే ఈ పాప జుట్టు తీసేయించిన కారణం వేరే ఉంది. బెంగుళూరుకు(Bengaluru) చెందిన ఒక ఎన్జీఓ(NGO) అగర్తలలో(Agartala)ని బరదోవాలిలో నివసిస్తున్నాడు. ఈయన పేరు అనిమేష్ ఘోష్. ఇతనికి అనసూయ అనే 5ఏళ్ళ పాప ఉంది(5years girl). అనిమేష్ ఘోష్ కు ఒకరోజు ఒక మెయిల్ అందింది. అందులో నాగ్ పూర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో సంఘమిత్ర అనే ఓ మహిళ చికిత్స పొందుతోందని, ఆమెకు క్యాన్సర్ కారణంగా జుట్టు మొత్తం పోయిందని తెలిపారు. ఆమె నిరాశ నుండి బయటపడేందుకు హెయిర్ ట్రాన్స్ఫ్లాంట్ కోసం జుట్టు డొనేషన్ గా కావాలని అడిగారు. ఆ మెయిల్ చూసిన తరువాత అనిమేష్ తన భార్య సీమాతో చర్చించారు. వారిద్దరూ చిన్న చిన్న సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండటం వల్ల సంఘమిత్రకు సహాయం చేయాలనుకున్నారు. తమ 5ఏళ్ళ కూతురుకు జుట్టు ఎంతో పొడవుగా ఆరోగ్యంగా పెరిగినందువల్ల వారు మరోమాట ఆలోచించకుండా కూతురు జుట్టు డొనేట్ చేయాలని అనుకున్నారు.

Blood vs Snake Venom Video: రక్తాన్ని ఓ గ్లాసులో పోసి.. ఒక్క చుక్క పాము విషాన్ని అందులో వేస్తే క్షణాల్లోనే షాకింగ్ సీన్..!


భార్యాభర్తలు ఇద్దరూ జుట్టు డొనేట్ చేయాలనుకున్న విషయాన్ని కూతురుతో చర్చించగా ఆ పాప కూడా ఎంతో సంతోషంగా అంగీకరించింది. ఆమె అంగీకారం తరువాత వారు సెలూన్ కు చేరుకుని పాప జుట్టును జాగ్రత్తగా కత్తిరించి సంఘమిత్రకు పంపించారు(5years girl donate her hair for cancer patient). ఈ బయటకు తెలియడంతో 5ఏళ్ళ ఈ చిన్నారి తెగ వైరల్ అవుతోంది. 'ఇంత చిన్న వయసులోనే నీకు ఎంత పెద్ద మనసు ఉంది తల్లీ' అని పాపను మెచ్చుకుంటున్నారు. 'పిల్లలు దేన్నీ అంత సులువుగా ఇవ్వరు, కానీ ఈ పాప మాత్రం ఎంతో సంతోషంగా తన జుట్టును డొనేట్ చేసింది' అని కామెంట్ చేస్తున్నారు.

Fingernails: గోర్ల మాటున దాగి ఉండే ఆరోగ్య రహస్యాలు.. గోర్లు వాటంతట అవే విరిగిపోతూ ఉంటే అర్థమేంటంటే..!


Updated Date - 2023-09-28T10:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising