Viral News: ఇలాంటి వ్యాధులు ఉన్న వారికి ఈ మొక్కే సంజీవని లెక్క.. వీటి ఆకులతో ప్రమాదకర రోగాలు కూడా పరార్..!
ABN, First Publish Date - 2023-11-04T13:36:34+05:30
మనచుట్టూనే ఉన్నా ఈ మొక్క గురించి పెద్దగా పట్టించుకోం. కానీ ఈ మొక్క ఆకులు, పువ్వులు, కాండం, విత్తనాలు ఇలా అన్నీ అద్బుతం చేస్తాయి.
ప్రజలను ఎన్నో రకాల వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. వీటిలో కొన్ని ప్రాణాంతకమైనవి కూడా ఉన్నాయి. ఏ చిన్న జబ్బు వచ్చినా వెంటనే డాక్టర్ల దగ్గరకు పరిగెత్తడం, వైద్యం చేయించుకోవడం కామన్ అయిపోయింది. విపరీతమైన మందులు, ఇంజెక్షన్ల వాడకం వల్ల శరీరం బలహీనంగా మారుతుంది. ప్రకృతిలో భాగంగా మనిషి చుట్టూ ఉన్న ఎన్నో రకాల మొక్కలు, వంటింటి దినుసులతో ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు. దేవుడి పూజకు ఎంతో శ్రేష్టం అయిన పారిజాతం పూల గురించి అందరికీ తెలిసిందే. కానీ పారిజాతం చెట్టు, ఆకులను ఉపయోగించి బోలెడు ప్రమాదకర వ్యాధులను కూడా ఇట్టే నయం చేసుకోవచ్చు. అసలు పారిజాతం చెట్టు, దాని ఆకులు ఏ జబ్బుకు ఎలా ఉపయోగపడతాయి? ఇందులో ఉన్న ఔషద గుణాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..
పారిజాతం కాండం పొడిని తీసుకుంటే కీళ్లనొప్పులు , మలేరియా జ్వరం చాలాతొందరగా తగ్గుతాయి. ఇక వీటి గింజలు బట్టతలను తగ్గించడంలోనూ, పైల్స్ చికిత్సలోనూ ఉపయోగిస్తారు. పారిజాతం బెరడును తమలపాకులో పెట్టుకుని తింటే విపరీతమైన దగ్గు కూడా మంత్రించినట్టు తగ్గిపోతుంది.
Read Also: Health Facts: డయాబెటిస్ ఉంది కదా అని చపాతీలను పక్కన పెట్టేస్తున్నారా..? గోధుమ పిండికి బదులుగా ఈ మూడింటినీ వాడితే..!
ఎక్కడైనా పారిజాతం చెట్టు ఉందంటే ఉదయం కాగానే మంచి సువాసన ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తుంది. ఈ పువ్వుల సువాసన అరోమా థెరపికి తక్కువేం కాదని అంటున్నారు. పారిజాతం యాంటీఫైరేటిక్ గా ప్రభావం చూపిస్తుంది.
సాధారణ జ్వరం, డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఈ ఆకుల ఔషదాన్ని తీసుకుంటే చాలా తొందరగా నయం అవుతుంది.
పారిజాతం ఆకుల ఔషదం ఎలా చేసుకోవాలంటే..
13 నుండి 14 పారిజాత ఆకులను బాగా కడిగి ఒక పాత్రలో నీటిలో వేసి నీరు సగం అయ్యేదాక మరిగించాలి. తరువాత స్టవ్ ఆప్ చేసి ఈ నీటిని వడగట్టి గోరువెచ్చగా తాగాలి. చాలారోజుల నుండి వేధిస్తున్న కీళ్ల నొప్పులు కూడా ఈ ఆ ఆకుల ఔషదం తీసుకుంటూ ఉంటే క్రమంగా తగ్గిపోతాయి.
Read Also: White Hair: ఎంత ప్రయత్నించినా తెల్ల జుట్టు నల్లగా మారిపోవడం లేదా..? ఒక్కసారి ఈ పొడిని ట్రై చేయండి.. 30 రోజుల్లో..!
Updated Date - 2023-11-04T13:36:35+05:30 IST