Viral: ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేదు.. కానీ ఇప్పుడు ఏడాదికి రూ.85 లక్షలు సంపాదన.. బస్సు కండక్టరే కానీ..!
ABN, First Publish Date - 2023-06-21T13:49:57+05:30
పేదవాడిగా పుట్టడం తప్పు కాదు పేదవాడిగానే మరణించడం తప్పు అని ఓ గొప్ప మాట ఉంది. ఈ మాట ఇతను అక్షరాలా పాటించి చూపిస్తున్నాడు.
పేదవాడిగా పుట్టడం తప్పు కాదు పేదవాడిగానే మరణించడం తప్పు అని ఓ గొప్ప మాట ఉంది. ఈ మాట ఇతను అక్షరాలా పాటించి చూపిస్తున్నాడు. ఒకప్పుడు తినడానికి తిండికూడా లేదు. కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదిద్దామనుకుంటే మధ్యలోనే చదువు ఆగిపోయింది. అపసోపాలు పడి కండెక్టర్ ఉద్యోగం సంపాదించాడు. కానీ ఆ తరువాత అతని పట్టుదల, కష్టం అతన్ని ముందుకు నడిపించాయి. తినడానికి ఇబ్బంది పడిన అతను ఇప్పుడు ఏడాదికి 85లక్షలు సంపాదిస్తున్నాడు. ఎంతో మంది పేదవారికి ప్రేరణగా నిలుస్తున్న ఈ వ్యక్తి ఎవరు? అతని జీవితం ఏంటి పూర్తీగా తెలుసుకుంటే..
విష్ణారామ్ అనే వ్యక్తి రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం బార్మర్ జిల్లాలోని గుర్ఖారామ్ అనే వ్యక్తికి 1978లో జన్మించాడు. ఇతని తండ్రి రైతు. విష్టారామ్ 7వ తరగతి చదువుతున్నప్పుడు ఇతని తల్లి గుండెపోటుతో(mother dies with heart attack) మరణించింది. నలుగురు అక్కాచెల్లెళ్ళు, ఒక సోదరుడు ఉన్న ఇతని కుటుంబం పేదరికంతో ఉండేది. ఈ పరిస్థితులలోనే విష్ణారామ్ తన కాలేజీ చదువు కూడా పూర్తీచేశాడు. పై చదువులు చదువులు చదువుతుండగా ఇంటి పరిస్థితుల కారణంగా మధ్యలోనే చదువు మానెయ్యాల్సి వచ్చింది. ప్రైవేట్ బస్ కండెక్టర్ గా(private bus conductor) ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. దాదాపు 20ఏళ్ళ పాటు కేవలం కండక్టర్ గా మాత్రమే కాకుండా సూరత్ లో డైమంద్ గ్లైండర్ వర్క్ చేశాడు. ఆ తరువాత స్టీల్ సామాన్ల దుకాణంలోనూ, మొబైల్ షాపులోనూ, ట్రక్కు డ్రైవర్ గానూ పనిచేస్తూ చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలోనే అతను ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ చమురు బావుల(oil wells) డ్రిల్లింగ్ కోసం ఉపయోగించే పరికరాలను(drilling equipment) తయారుచేయడం మొదలుపెట్టారు. మొదట్లో ఇది చాలా తక్కువ ఆదాయాన్ని ఇచ్చేది. కానీ రాను రాను ఈ వ్యాపారం జోరందుకుంది. అతను మొదలుపెట్టిన ఈ పని ఇప్పుడు సంవత్సరానికి 85లక్షల రూపాయాల(85lakhs income per annual) సంపాదన ఇస్తోంది.
Viral Video: వామ్మో.. ఆడ చిరుతలు వేటలో ఇంత గ్రేటా? నీళ్ళలో మాటు వేసి మరీ ఓ ఆడచిరుత ఎలా వేటాడిందో చూస్తే..
దుబాయ్ లో లక్షలు సంపాదిస్తున్న విష్టరామ్ తన మూలాలు మరిచిపోలేదు. అతను ఎంత దూరం వెళ్లినా తను పుట్టి పెరిగిన ఊరిని మరవలేదు. ఇటీవలే అతను దుబాయ్ నుండి తన స్వగ్రామానికి వచ్చి తన ఇద్దరు కూతుళ్ల పెళ్ళిని తన స్వగ్రామంలోనే నిర్వహించాడు. విష్టరామ్ ఫోటోను నారీ పురస్కార విజేత రూమా దేవి(Ruma devi) తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి అతను జీవితంలో ఎదిగిన విధానంను కొనియాడారు.
Health Tips: పిచ్చి గడ్డి అని పీకి పారేస్తున్నారు కానీ.. అసలు నిజాలు తెలిస్తే బంగారంలా పెంచుకుంటారు.. జ్యూస్‌గా చేసుకుని తాగితే..
Updated Date - 2023-06-21T16:04:09+05:30 IST