ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Photo: ఈ ఫొటోలోని పాప ఎవరో గుర్తు పట్టగలరా..? తండ్రి సినీ ఇండస్ట్రీని ఏళ్ల తరబడి ఏలుతున్న అగ్రహీరో..!

ABN, First Publish Date - 2023-04-11T19:13:07+05:30

'ఎవరు ఈ పాప? టెడ్డీ బేర్ మీద కూర్చుని తదేకంగా చూస్తున్న ఈ పాప చూపులు శాసనాలే అన్నట్టున్నా సినీ ప్రపంచాన్ని ఎందుకు శాసించలేకపోయింది?'

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రంగు రంగుల సినీప్రపంచంలో మిణుకు మిణుకుమని మెరిసేవారు కొందరే. అందంతో, నటనతో బోలెడు అభిమానులను సంపాదించుకుని సినీప్రపంచాన్ని ఏలుతుంటారు. తమ తరువాత తమ పిల్లలను కూడా సినీవారసులను చేస్తుంటారు. ఇప్పుడు ఒక చిన్న పాప ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సినీ ఇండస్ట్రీని ఏళ్ళ తరబడి తన నటనతో ఏలుతున్న అగ్రహీరో కూతురే ఆ పాప అనే విషయం నెటిజన్లకు మరింత ఆసక్తిని పెంచుతోంది. 'ఎవరు ఈ పాప? టెడ్డీ బేర్ మీద కూర్చుని తదేకంగా చూస్తున్న ఈ పాప చూపులు శాసనాలే అన్నట్టున్నా సినీ ప్రపంచాన్ని ఎందుకు శాసించలేకపోయింది?' అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఈ పాప ఎవరు? ఈ పాపకు తండ్రి అయిన ఆ అగ్రహీరో ఎవరు? మొదలైన వివరాల్లోకి వెళితే..

స్టార్ కిడ్(Star kid) అనే పేరులోనే ఓ గుర్తింపు ఉంటుంది. ఓ స్టార్ కిడ్ చిన్ననాటి ఫోటో(star kid childhood photo) ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇప్పుడంటే తెలుగు సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది కాబట్టి టాలీవుడ్ రేంజ్ పెరిగింది. ఒకప్పుడు భారతీయ సినిమాను బాలీవుడ్(Bollywood) శాసించింది. బాలీవుడ్ లో అధ్బుతమైన నటుడు అనే ప్రస్తావన తెస్తే చాలామంది 'బిగ్ బీ'(Big B) అంటారు. బిగ్ బీ అనగానే ఆరడుగులా రెండంగుళాల ఆజానుబాహుడు కళ్లముందు మెదులుతాడు. ఎన్నెన్నో అవార్డుల సినిమాలను తన ఖాతాలోవేసుకుని 'స్టార్ ఆఫ్ ది మిలీనియం'(star of the millennium) అనే బిరుదును కూడా పొందాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న పోటోలో పాప బాలీవుడ్ సినిమాను ఏలిన అమితాబ్ గారాల పట్టి శ్వేతా బచ్చన్(Amitabh bachchan daughter swetha bachchan). అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్(Amitabh bachchan, Jayabachchan) ఇద్దరికీ బాలీవుడ్ లో మండి స్టార్ డమ్ ఉంది. సాధారణంగా స్టార్ హీరోల కూతుళ్ళు, కొడుకులు సినీ ఇండస్ట్రీలో అరగ్రేటం చేసి సినిమా వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారు. కానీ శ్వేత మాత్రం ఇందుకు విభిన్నం. ఆమె ఎప్పుడూ ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు. 22ఏళ్ళ వయసుకే పెళ్ళిచేసుకుని ఓ ఇంటి కోడలైపోయిన ఈమె తన కెరీర్ విషయంలో మాత్రం చక్కని ప్రణాళికలు వేసుకుంటూ సాగింది. ఫ్యాషన్ డిజైనింగ్(Fashion designing) లో తన కెరీర్ ను డిజైన్ చేసుకుని తనే స్వంతంగా MXS అనే బ్రాండ్ ను క్రియేట్ చేసింది. అలాగే 'ప్యారడైజ్ టవర్'(paradise towers) అనే పుస్తకాన్నికూడా రచించింది. తన తల్లిదండ్రులతో ఎంతో సన్నిహితంగా ఉండే శ్వేత తన కొడుకు అగస్త్య కు కెరీర్ ఎంచుకునే స్వేచ్చ ఇచ్చింది. ఆమె కొడుకు ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే హాడావిడిలో ఉన్నాడట.

White hair: కొబ్బరి నూనెలో ఈ రెండిటినీ కలపి రాసుకోండి చాలు.. తెల్లజుట్టు నల్లగా మారిపోవడం ఖాయం..!


Updated Date - 2023-04-11T19:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising