ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Photo: ఈ ఒక్క ఫొటోలో 160 మిలియన్ల సంవత్సరాల నాటి రహస్యం.. ఎట్టకేలకు బయటపెట్టిన పురాతత్వ శాస్త్రవేత్తలు..!

ABN, First Publish Date - 2023-02-18T12:00:01+05:30

ఒకటి రెండు కాదు ఏకంగా 160మిలియన్ సంవత్సరాల కిందటి రహస్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకటి రెండు కాదు ఏకంగా 160మిలియన్ సంవత్సరాల కిందటి రహస్యం రివీల్ అయ్యింది. మనుషులకంటే ముందు ప్రపంచ ఉనికి గురించి బహిర్గతం చేసే ఈ విషయం తెలుసుంటే..

నార్త్ ఇంగ్లాండ్ సముద్రతీరంలో మేరీవుడ్ అనే ఆర్కియాలజీ శాస్త్రవేత్త పరిశోధనల కోసం గవ్వలు, శంఖులు సేకరిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ దగ్గరలో పెద్దగా ఒక గుర్తు కనిపించింది. మొదట అదేంటో ఆమెకు అర్థం కాలేదు. ఆ తరువాత బాగా గమనించి చూసిన తరువాత ఆమె బుర్రలో ఫ్లాష్ లాగా అదేంటో అర్థమైంది. తాను చూసింది నిజమేనా అనే డైలమాలో ఇతర శాస్త్రవేత్తలకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న శాస్త్రవేత్తేలు ఆ గుర్తును అది డైనోసార్ పాదముద్ర అని నిర్థారించారు. ఆ పాదముద్ర వెనుక కథ ఏంటి అది ఎన్నేళ్ళ కిందటిది అనే విషయం తెలుసుకోవడానికి పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. ఆ పరిశోధనల్లో ఊహించని నిజాలు బయటపడ్డాయి.

Read also: భర్తకు విడాకులిచ్చి మరీ బీటెక్ పూర్తి.. మూడు కంపెనీల ఆఫర్లను రిజెక్ట్ చేసి.. 25 ఏళ్ల వయసులోనే..

జురాసిక్ పార్క్ సినిమా మొదటిసారి చూసినవారికి డైనోసార్ ల ఆకారం, వాటి ప్రవర్తన అన్నీ గుర్తుండిపోయి ఉంటాయి. నిజానికి అన్ని డైనోసార్లు సినిమాల్లో చూపించినంత రాక్షస స్వభావంతో ఉండవు. వీటిలో కొన్ని మాంసాహారానికి మరిగినవి ఉంటాయట. పాదముద్రలో బయటపడిన డైనోసార్ కూడా అలాంటిదేనని చెప్పారు. ఇంకోవిధంగా చెప్పాలంటే అది పెద్ద రౌడీ డైనోసార్ అని తేలింది. 2021సంవత్సరంలో కనిపించిన ఈ డైనోసార్ పాదముద్ర ప్రపంచంలో ఇప్పటి వరకు కనిపించిన అతిపెద్ద పాదముద్ర అని తెలిపారు. దీని ఆధారంగా భూమి మీద మనుషుల కంటే పూర్వం జీవించిన జీవుల విషయంలో ముఖ్యంగా ఆ సముద్రతీర ప్రాంతంలో అప్పట్లో సంచరించిన జంతువుల గురించి, వన్యప్రాణుల గురించి బోలెడు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో పాలియోంటాలజిస్ట్ గా ఉన్న డాక్టర్ డీన్ లోమాక్స్ ఈ పాదముద్రను అధ్యయనం చేస్తున్నాడు. ఆయన పరిశోధన తరువాత ఆ పాదముద్రను ప్రజల సందర్శన కోసం ఉంచుతామని చెప్పారు. మనకంటే ముందు ఈ భూమిని ఏలిన ఈ ప్రాణుల గురించి ఇంకేం ఆసక్తికర విషయాలు తెలుస్తాయో చూడాలి.

Updated Date - 2023-02-18T12:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising