Viral Video: రోజూ ఏదో కుడుతున్నట్లు ఉన్నా మొదట అనుమానం రాలేదు.. చివరకు ఓ రోజు ఇంటి సీలింగ్ బద్ధలుకొట్టి చూస్తే..
ABN, First Publish Date - 2023-10-20T12:19:06+05:30
ఏవో కుడుతున్నట్టు అనిపిస్తే మొదట దోమలు అనుకున్నారు, తరువాత ఈగలనుకున్నారు. కానీ సీలింగ్ బద్దలు కొట్టి చూస్తే దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది.
ఇళ్ళలో చీమలు, దోమలు, ఈగల గోల ఎప్పుడూ ఉండేదే. వాతావరణ పరిస్థితులను బట్టి వాటి నివాసానికి అనువైన స్థలం దొరికే వచ్చేస్తాయి. ఆ కుటుంబ సభ్యులు తమను ఏవో కుడుతూంటే దోమలేమో అనుకున్నారు. కాస్త పెద్ద పరిమాణంలో ఇంట్లో ఎగురుతూంటే ఈగలు అని అనుమానపడ్డారు. కానీ ఇంటి సీలింగ్ నుండి వింత శబ్దాలు వస్తోంటే ఎందుకో వారికి డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిదని రెస్క్యూ టీమ్ ను పిలిచి సీలింగ్ బద్దలు కొట్టించారు. ఆ తరువాత కనిపించిన దృశ్యానికి వారు పెద్ద షాక్ లోకే వెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'బాబోయ్ మొదట ఆ ఇంట్లోనుండి పారిపోండి' అని అంటున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఎన్నో యేళ్లుగా నివసిస్తున్న ఇళ్ళలో ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఆ ఇంటివారు షాక్ కు లోనవుతుంటారు. పాపం ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు పనులలో నిమగ్నమై ఉండగా అప్పుడప్పుడు ఏవో కుట్టడం వారు అనుభూతి చెందారు. మొదట దోమలేమో అని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఇంట్లో పెద్ద పరిమాణంలో గాలిలో ఎగురుతూ కనిపించేసరికి అవి ఈగలేమో అని అనుకున్నారు. అవి క్రమంగా ఇంట్లో ఎక్కువగా సంచరించడం గమనించగానే వారికి ఆందోళన కలిగింది. అవేంటో అని నిశితంగా పరిశీలిస్తే అవి దోమలు, ఈగలు కావు తేనెటీగలని గుర్తించారు. ఆ తేనెటీగలు ఇంట్లో ఎగురుతూ ఇంటి పైకప్పు ప్రాంతం దగ్గర అదృశ్యమవుతుండటంతో అదేం మాయో అర్థం కాక వారు కంగారు పడ్డారు. వెంటనే రెస్క్యూ టీమ్ కు కబురు పెట్టారు. రెస్య్కూ టీమ్ అక్కడికి చేరుకుని సీలింగ్ ను ఓపెన్ చేసి చూడగా ఆ టీమ్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు. ఒకటి రెండు కాదు పెద్ద మొత్తంలో తేనెపట్టులు ఆ సీలింగ్ లోపల కనిపించాయి(Bees in house ceiling). తేనెపట్టుకు లెక్కలేనన్ని తేనెటీగలు చుట్టుకుని ఉన్నాయి.
Health Tips: భోజనం తరువాత స్వీట్లు తింటే ఆ మజానే వేరు.. కానీ ఈ నిజాలు తెలిస్తే..
ఈ వీడియోను Crazy Clips అనే ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. తేనెటీగలు వెళ్ళడానికి అక్కడ దారే లేదు' అనే క్యాప్షన్ ను మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు ఆ సీలింగ్ లోపలికి తేనెటీగలు ఎలా ప్రవేశించాయో అర్థం కాక చాలామంది బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. 'బహుశా తేనెటీగలు వెళ్లడానికి అనువుగా అక్కడ ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. లేకపోతే అవి ఎలా తేనెపట్టు పెడతాయి?' అని ఒకరు కామెంట్ చేశారు. 'అక్కడ దయ్యం ఏమైనా ఉందేమో' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఆ ఇంట్లో నుండి ఆ తేనెటీగలు బయటకు వెళ్లడం కాదు, ఆ ఇంటివారే బయటకు వెళ్లిపోవడం మంచిది, నేనైతే పారిపోమని సలహా ఇస్తాను' అని ఇంకొకరు కామెంట్ చేశారు. తేనెవ్యాపారం చేయచ్చంటూ మరికొందరు ఫన్నీ సెటైర్లు వెశారు.
Viral News: అది కారా.. లేక టపాసుల దుకాణమా.. రోడ్డుపై వెళ్తూ వీరు చేసిన పని తెలిస్తే..
Updated Date - 2023-10-20T12:19:06+05:30 IST