ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: గాలిలో చక్కర్లు కొడుతున్న పక్షిని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. దీని రెక్కలు చూస్తే..!

ABN, Publish Date - Dec 25 , 2023 | 11:58 AM

జీవప్రపంచం చాలా వింతలతో కూడి ఉంటుంది. వాటిలో ఈ పక్షి కూడా ఒకటని చెప్పవచ్చు.

ఈ సృష్టిలో కొన్ని కోట్ల ప్రాణులున్నాయి. వీటిలో బోలెడు వింతలు, విశేషాలు ఉంటాయి. సాధారణంగా ఒక పక్షి, ఒక జంతువు ఎక్కడైనా కనిపిస్తే దాన్ని పట్టించుకోకుండానే వెళ్లిపోతుంటారు. కానీ వాటిలో ఏదైనా వింత ఉంటే మాత్రం ఇక భీభత్సంగా వైరల్ అవుతాయి. ఇప్పుడు ఓ పక్షి ఇలాగే వైరల్ అవుతోంది. అది గాల్లో చక్కర్లు కొడుతున్న విధానం, దాని రెక్కల తీరు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

జీవప్రపంచం చాలా వింతలతో కూడి ఉంటుంది. వీటిలో మనుషులకు కనిపించనివి చాలానే ఉన్నాయి. అరుదుగా కనిపించే వింత పక్షులు, జంతువులు సోషల్ మీడియోలో బాగా వైరల్ అవుతుంటాయి. ఈ పక్షి అలాగే వైరల్ అయింది. వీడియోలో ఓ పక్షి గాల్లో చక్కర్లు కొడుతుండటం గమనించవచ్చు. ఈ పక్షి పేరు స్టాండర్డ్-వింగ్డ్ నైట్ జార్. ఇది ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన పక్షి. సాధారణంగా పక్షులకు రెండు రెక్కలుంటాయి. కానీ ఈ నైట్ జార్ పక్షులకు మాత్రం నాలుగు రెక్కలు ఉంటాయి. రెండు రెక్కలు సాధారణ పక్షులకు ఉన్నట్టు ఉండగా మరో రెండు రెక్కలు వింతగా ఉన్నాయి. సాధారణ రెక్కలకు సన్నని తీగలాగా ఈక ఉంటుంది. ఈ ఈకలు రెండూ ఆ పక్షి ఎగిరేటప్పుడు నిలువుగా పైకి లేస్తాయి. కింద రెండు రెక్కలు అల్లారుస్తుంటే పైన రెండు చిన్న రెక్కల్లాంటి ఈకలు కూడా అదే విధంగా కదులుతాయి. ఈ పక్షులు గాల్లో ఎగురుతుంటే చూడటానికి భలే అందంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: శనగలు, బెల్లం.. ఈ సూపర్ కాంబినేషన్ తింటే కలిగే లాభాలివీ..!


విచిత్రం ఏమిటంటే చాలా వరకు పక్షులు గూడు కట్టి గుడ్లు పెడతాయి. కానీ ఈ నైట్ జార్ పక్షులు మాత్రం ఎక్కడా గూడు కట్టకుండా నేరుగా నేలపైననే గుడ్లను పెడతాయి. ఈ పక్షికి సంబంధించిన వీడియోను Love Uganda Safaris అనే ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఇలాంటి పక్షిని తామెన్నడూ చూడలేదని ఆశ్చర్యపోతున్నారు. 'ప్రకృతి చాలా విచిత్రమైనది' అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Heart Attacks: గుండెకు గండం.. డిసెంబర్ లోనే ఈ సమస్య ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే..!


Updated Date - Dec 25 , 2023 | 11:58 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising