Viral Video: సముద్రం అడుగున షాకింగ్ మిస్టరీ.. ఇది పక్షినా..? చేపనా..? గాల్లో చక్కర్లు కొట్టినట్టు నీళ్లల్లో ఎలా ఎగురుతోందో చూస్తే..!
ABN, First Publish Date - 2023-11-10T12:15:37+05:30
సముద్రపు నీటి అడుగున అన్వేషణకు వెళ్లిన శాస్త్రవేత్తలకు ఊహించని షాక్ తగిలింది. నీటి అడుగున స్వేచ్చగా చేప లాగా ఈదుతున్న ఈ పక్షిని చూస్తే..
పంచభూతాలను కలిపి ప్రకృతి అంటారు. ఈ ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రకృతిలో మనుషులకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా జలచరాల ప్రపంచం చాలా వింతగా ఉంటుంది. సముద్రం అట్టడుగున ఎన్నో జలచరాలు నివసిస్తుంటాయి. వీటి గురించి అన్వేషణ జరపడానికి వెళ్లిన శాస్త్రవేత్తలకు ఊహించని షాక్ తగిలింది. సముద్రపు నీటి లోపల స్వేచ్చగా చేప లాగా ఈదుతూ ఓ పక్షి కనిపించింది. గాల్లో చక్కర్లు కొట్టినట్టు ఈ పక్షి నీటిలో ఎగురుతుండటం చూసి నెటిజన్లు కూడా షాకవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
చిన్నప్పుడు సోషల్ సబ్జెక్ట్ లో భాగంగా నీటి ప్రాంతాలను జలావరణం అంటారని చదువుకునే ఉన్నాం. నీటి అట్టడుగున జలచరాలు మానవులకు ఎప్పుడూ విచిత్రమే. ఇలాంటి రహస్యాలను ఛేదించడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తుంటారు. అలాంటి పరిశోధనలలోనే నీటిలో పక్షి ఎగురుతూ కనిపించింది(bird flying under water). వీడియోలో సముద్రపు అట్టడుగున(under the sea) శాస్ర్తవేత్తలు కెమెరాలతో జలచరాలను రికార్డ్ చేస్తున్నారు. ఈ సమయంలో హఠాత్తుగా నీటిలో ఒక జీవి ఎగురుతూ కనిపిస్తుంది. అది పక్షినా లేక వింత చేపనా అనే విషయం వెంటనే అర్థం కాలేదు. ఆ తరువాత సరిగ్గా గమనిస్తే రెక్కలు అల్లారుస్తూ నీటిలో ఎగురుతన్న పక్షి కనిపిస్తుంది. పక్షులు సముద్రంలో అంత లోతుకు వెళ్లడం, అలా రెక్కలు అల్లారుస్తూ ఎగరడం చాలా విచిత్రంగా ఉంది. పక్షి అలా ఎగురుతుంటే చేపలన్నీ చాలా ఆశ్చర్యంగా అలాగే నీటిలో నిలబడిపోయి చూస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Boiled Eggs: చాలా మందికి తెలియని నిజాలివీ.. ఉడికించిన కోడిగుడ్డును తినడం వల్ల..!
ఈ వీడియోను The Best అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఇది చాలా సరదాగా ఉంది. ఇది ఏ రకపు చేప' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియోకు 21లక్షల పైన వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'ఇది చాలాప్రత్యేకంగా ఉంది, ఇంతకు ముందు ఇలాంటి పక్షిని ఎక్కడా చూళ్ళేదు' అని ఒకరు కామెంట్స్ చేశారు. 'అద్బుతం సముద్రంలో ఈ జీవిని చూసి జలచరాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి' అని మరొకరు కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: Garlic: వంటింట్లో కనిపించే వెల్లుల్లి గురించి మీకు తెలియని 7 నిజాలు.. కూరల్లో వాడేది ఇందుకేనన్నమాట..!
Updated Date - 2023-11-10T12:18:02+05:30 IST