ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral video: పిల్లల్ని తినేద్దామని వచ్చిన చిరుతను ముప్పుతిప్పలు పెట్టిన ముళ్ళపంది జంట.. ఫిధా అవుతున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2023-02-22T12:39:52+05:30

జంతువులైనా, మనుషులు అయినా తమ పిల్లలను రక్షించుకోడానికి ఎంతకైనా తెగించడం పక్కా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ప్రపంచంలో అమ్మానాన్నల ప్రేమ తరువాతే ఇంకేదైనా.. ఆ అద్భుతాన్ని కళ్ళారా చూసేందుకు కొన్ని సందర్భాలు వస్తాయి. అలాంటిదే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. జంతువులైనా, మనుషులు అయినా తమ పిల్లలను రక్షించుకోడానికి ఎంతకైనా తెగించడం పక్కా.. ఓ ముళ్ళపంది జంట తమ పిల్లల్ని కాపాడుకునేందుకు చేసిన పోరాటం ఆ విషయాన్ని మరింత బలపరుస్తోంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి వివరాలు తెలుసుకుంటే..

ఓ ముళ్ళపంది(Porcupine) జంట తమ రెండు పిల్లలను వెంటబెట్టుకుని దారిలో నడుస్తూ వెళుతున్నాయి. అప్పుడే ఒక్కసారిగా చిరుతపులి(Lepord) అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిరుతపులి ముళ్ళపంది పిల్లల్ని నోటకరుచుకుని పోదామనే ప్రయత్నంలో ఉంది. కానీ ముళ్ళపందులలో ఉన్న తల్లిదండ్రుల ప్రేమ వాటిని అలెర్ట్ చేసింది. చిరుతను చూసి పారిపోకుండా తమ పిల్లలను కాపాడుకోవడానికి తెగించాయి. వెంటనే వాటికి ఉండే ముళ్ళను విప్పార్చి తమ పిల్లలకు గోడలా అడ్డు నిలబడ్డాయి. ముళ్ళపంది పిల్లలకోసం ప్రయత్నం చేస్తున్న చిరుతకు ఆశాభంగం ఎదురవుతున్నా ఆ చిరుత కూడా వెనక్కు తగ్గలేదు. నోటికి దగ్గరగా ఉన్న ఆహారం వదులుకోవడం ఇష్టంలేక ఆ పిల్లలకోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. దానితో పోరాడలేం, మన పిల్లలకు ఆయుష్షు లేదులే అని ఆ ముళ్ళపందులు నిరాశ పడలేదు. ఆ చిరుత ఎటువైపు తిరిగితే అవి అటువైరు తమ ముళ్ళను చూపుతూ పిల్లలకు అడ్డుగోడ ఏర్పరిచాయి. ప్రయత్నం చేసి చేసి విసిగిపోయిన చిరుత ఈ ముళ్ళపందుల ప్రేమ ముందు నా పోరాటం నిలబడదని గ్రహించి వచ్చినదారినే వెనుతిరిగింది.

Read also: Shocking Video: అమ్మబాబోయ్.. ఏంటీ ఈ వింత ఆకారం.. చేపలు ఉండాల్సిన అక్వేరియంలో ఇదేంటి..!


యూట్యూబ్ లో @Latest Sightings అనే ఛానెల్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది నెట్టింట్ట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ ముళ్ళపందులు చూపిన పోరాట పటిమకు, వాటికి తమ పిల్లలపై ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు. ప్రపంచంలో అద్భుతమైనది తల్లిదండ్రుల ప్రేమనే.. అంటున్నారు. ఇంత రేంజ్ లో సెక్యూరిటీ ఎవరిస్తారు ఇది Zక్లాస్ సెక్యూరిటీ అని ముళ్ళపందులను పొగిడేస్తున్నారు.

Updated Date - 2023-02-22T12:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising