Viral Video: హెల్మెట్ పెట్టుకోలేదని ఓ యువతికి రూ.1000 చలానా.. అసలు సిసలు ట్విస్ట్ ఏంటంటే..!
ABN, First Publish Date - 2023-07-10T14:13:07+05:30
ఇంటి పనులలో నిమగ్నమైన యువతికి ఓ మెసేజ్ వచ్చింది.. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు రూ. 1000 చలానా కట్టమంటూ ట్రాఫిక్ పోలీసులు యువతి మొబైల్ కు మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ చూసుకున్న సదరు యువతి షాకైంది. దీని వెనుక..
హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదం. ఈ ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ రూల్స్ కూడా పెట్టారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసేవారికి చలానా విధించడం కామన్. ఓ మహిళ హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు రూ. 1000 చలానా కట్టమంటూ ట్రాఫిక్ పోలీసులు మొబైల్ కు మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ చూసుకున్న సదరు యువతి షాకైంది. నాకు ఇలా చలానా వేశారంటూ సోషల్ మీడియా వేదికగా తన గోడు వెళ్ళబోసుకుంది. అసలు విషయం తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఏం పోలీసులురా బాబూ మరీ ఇలా ఎలా తయారయ్యారంటూ మండిపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం నోయిడా(Noida) పట్టణానికి చెందిన ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. గ్రేటర్ నోయిడా లోని బీటా-1 ప్రాంతంలో శైలజా చౌదరి అనే మహిళ నివాసం ఉంటోంది. ఈ మహిళ జులై 7వ తేదీన ఇంటి పనుల్లో ఉన్నప్పుడు ఆమె మొబైల్ కు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుండి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే తన కారును డ్రైవింగ్ కు తీసుకెళ్ళిన తన బంధువు ఏదో పొరపాటు చేసి ఉంటాడని, అందుకే ఏదో పైన్ పడి ఉంటుందని ఆమె భావించింది. అలా అనుకుంటూనే ఆ మెసేజ్ ఓపెన్ చేసింది. అయితే ఆ మెసేజ్ లో ఉన్న సారాంశం చూసి షాకైంది. 27వ తేదీ ఉదయం 8.29గంటల సమయంలో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.1000 చలానా కట్టాలంటూ ఆ మెసేజ్ లో మెన్షన్ చేశారు. దానికి ఆమె కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ను జత చేశారు(Helmet fine for car register). ఇది చూసి ఆమెకు దిమ్మతిరిగిపోయింది. అయినప్పటికీ చలానా వేసిన సమయంలో నేనసలు కారు ఢ్రైవింగ్ లో కూడా లేనంటూ చెప్పింది.
Long Hair: పొడవాటి జుట్టు కావాలా? ఈ ఆకును మూడురకాలుగా వాడితే చాలు.. ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు..
ఆ మహిళ తన సమస్య గురించి చెబుతూ 'నా పేరు మీద కేవలం హ్యుండాయ్ i20 మాత్రమే రిజిస్ఠర్ చేయబడి ఉంది. ద్విచక్రవాహనాలు ఏనీ నాకు లేవు. అలాంటప్పుడు ట్రాఫిక్ పోలీసులు చలానా ఎలా వేస్తారు? ఇది పూర్తీగా ట్రాఫిక్ పోలీసుల తప్పిదం. నాకు వేసిన చలాన్ ను రద్దు చేయాలి' అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేసింది. తనకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు పంపిన మెసేజ్ ప్రకారం వారు చెప్పిన గడువులోపల ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ లో హాజరు కావాలి, కానీ అది ఆమె నివాసానికి 35కి.మీ దూరంలో ఉంది. 'నా తప్పు లేకపోయినా ఇప్పుడు నేను 35కి.మీ డ్రైవ్ చేసి వెళ్ళాలి' అంటూ అయిష్టతను వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) ఆటోమేటిక్‌గా వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను రీడ్ చేస్తుందని, అయితే అప్పుడప్పుడు సిస్టమ్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తప్పుగా రీడింగ్ చేస్తుందని ట్రాఫిక్ DCP తెలిపారు. ఇలాంటి సమయంలో వాహన యజమాని పోలీసులను ఆశ్రయిస్తే , చలానా తప్పని నిర్ధారణ అయితే దాన్ని రద్దు చేస్తామని అన్నారు. ఇమెయిల్ లో కూడా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు 'ఏం పోలీసులండీ బాబూ ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు' అని పోలీసుల మీద మండిపడుతున్నారు.
SBI ATM: 10 సెకన్లలో మాయమైపోయిన ఎస్బీఐ ఏటీఎం.. అదేంటని అవాక్కవుతున్నారా..? ఈ వీడియోను చూస్తే..!
Updated Date - 2023-07-10T14:15:41+05:30 IST