Viral Video: బాహుబలి పరోటా.. బరువెంతో తెలిస్తే నోరెళ్లబెడతారేమో!
ABN, First Publish Date - 2023-03-28T19:56:45+05:30
భారతీయ వంటకాల్లో రొట్టెలకు ప్రత్యేకమైన, వైవిధ్యమైన స్థానం ఉంది. పూరాన్ పోలీ నుండి రోటీ వరకు..తందూరి రోటీ నుండి నాన్ వరకు ఇక్కడ చాలా అద్భుతమైన రొట్టెలు అందుబాటులో ఉన్నాయి.
Viral Video: భారతీయ వంటకాల్లో రొట్టెలకు ప్రత్యేక స్థానం ఉంది. పూరాన్ పోలీ(Puran Poli) నుండి రోటీ(Roti) వరకు..తందూరి రోటీ (Tandoori roti)నుండి నాన్(Naan) వరకు ఇక్కడ చాలా అద్భుతమైన రొట్టెలు అందుబాటులో ఉన్నాయి. పరోటా(Paratha) కూడా భారతదేశం నుండి వచ్చిన ఒక అద్భుతమైన ప్రత్యేక వంటకం. మనమందరం అల్పాహారంగా పరాటాను ఇష్టపడతాం. దీనిని పెరుగు లేదా తెల్ల వెన్న జత చేసి తింటే ఆహా..ఎంత రుచిగా ఉంటుంది. అయితే మనం ఇప్పటివరకు ఒక ప్లేట్ సైజ్‌లో ఉండే పరోటాను మాత్రమే చూశాం..తిన్నాం.. అయితే అతిపెద్ద సైజులో ఉండే బాహుబలి పరోటా గురించి మీరు విని ఉండరు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అతిపెద్ద పరోటా(బాహుబలి)కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..ఈ అద్భుతమైన వీడియో కేవలం రెండు రోజుల్లోనే వైరల్‌గా మారింది.
కాగా ఈ బాహుబలి పరాటా గురించి ఫుడీ-ఇన్‌కార్నెట్(Foodie_Incarnate) అని పిలువబడే ఓ ప్రముఖ బ్లాగర్ అమర్ సిరోహి(Amar Sirohi) ఓ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో షేర్ చేశాడు. దీనితోపాటు "భారతదేశంలోని ఈ అతిపెద్ద పరాటా(BIGGEST PARATHA of INDIA)ను పూర్తి చేయగలవారు ఎవరినైనా ట్యాగ్ చేయండి" అని క్యాప్షన్‌లో రాశాడు. ఈ క్లిప్‌లో, అతను జైపూర్ పరాఠా జంక్షన్ నుండి వచ్చిన ఈ అతిపెద్ద పరాటా తయారీకి సంబంధించిన కొన్ని వీడియోలు చూపించాడు. ఈ బాహుబలి పరాటా వ్యాసం 32 అంగుళాలు( 32 inches), దీని ధర రూ.819 మాత్రమే.
బాహుబలి పరోటా తయారీకి ముందుగా కావాలసినవి 1 కిలో ఆలూ, పనీర్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చి కొత్తిమీర, మసాలా దినుసులను కలిపి మొత్తం 2 కిలోల మిశ్రమాన్ని సిద్ధం చేశారు. తర్వాత 3.5 కిలోల గోధుమ పిండితో చపాతిలా రోలింగ్ చేసి దానిలో ఈ మిశ్రమాన్ని ఉంచుతారు. తిరిగి ముద్దగా చేసి మరళా పెద్దగా చపాతిలా రోలింగ్ చేస్తారు.. రోలింగ్ కోసం భారీ రోలింగ్ పిన్, టేబుల్ ఉపయోగించారు. 40 కిలోల బరువున్న భారీ తవా సహాయంతో పరోటా కాల్చబడింది. పరాటాపై నూనె, అమూల్ వెన్న మిశ్రమాన్ని పూయడానికి చివర ఒక గుడ్డతో ఒక స్టీల్ రాడ్ ఉపయోగిస్తారు. పెద్ద పరోటాను రెండు వైపులా కాల్చుతారు. దీనిని పెరుగు, పచ్చిచట్నీ, ఎరుపు వెల్లుల్లి చట్నీ, తెలుపు వెన్నతో కలిపి వడ్డించుకుంటే ఎంతో రుచిగా ఉంటుందని తెలిపారు.
Updated Date - 2023-03-28T19:59:43+05:30 IST