Viral Video: ఇలాంటి వెర్రి వేషాలే వద్దనేది.. పుట్టినరోజు సంబరంలో ఓ యువతి ఏకంగా అపార్టమ్మెంట్ కిటికి ఎక్కి మరీ డాన్స్.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-08-31T14:36:51+05:30
అత్యుత్సాహంతో అపార్మెంట్ కిటికి ఎక్కిమరీ డ్యాన్స్.. కానీ అంతలోనే..
పుట్టినరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆ రోజున స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులను పిలిచి ఎంతో ఘనంగా సంబరం జరుపుకుంటారు. కొంతమంది తమ పుట్టినరోజున వెర్రివేషాలు వేస్తారు. వారి ముచ్చట కాస్తా సంతోషాన్ని కలిగించకపోగా అనర్థాలకు దారితీస్తుంది. ఓ యువతి తన పుట్టిన రోజున అత్యుత్సాహంతో చేసిన పని అందరూ విస్తుపోయేలా చేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఏం పనులమ్మా తల్లీ.. ఇలాంటి వెర్రి వేషాలు అవసరమా?' అని యువతి మీద మండిపడుతున్నారు. ఈ వీజియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
పుట్టినరోజున(Birthday) ఉత్సాహంగా ఉండటం చాలా సహజమైన విషయం. ఇక నేటితరం వారైతే పార్టీలు, ఆటలు, పాటలు, డాన్సులతో చాలా సందడి చేస్తారు. వీడియోలో ఓ యువతి(young women) తన పుట్టినరోజును ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తోంది. ఆమె తన పుట్టినరోజున బర్త్ డే క్యాప్ పెట్టుకుని చెప్పలేనంత ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తోంది. అలా డ్యాన్స్ చేస్తున్నదల్లా ఉన్నట్టుండి తన అపార్మెంట్ లో ఉన్న కిటికి ఎక్కింది(women dance on window). కిటికి మీద నిలబడి గోడను పట్టుకుని ఆమె డ్యాన్స్ వేస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఆమె కిటికి మీద బ్యాలెన్స్ తప్పి బయటకు పడిపోయింది. అప్పటివరకు ఆమె డ్యాన్స్ వీడియో తీస్తున్న వ్యక్తి పరిగెత్తుకుంటూ కిందకు చూడగా సరిగా కనిపించలేదు. ఆమెకు ఏమైనా జరిగిందా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఆమె అపార్మెంట్ నుండి పడటంతో ఆమెకు ఖచ్చితంగా తీవ్రమైన గాయాలు అయ్యుంటాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Credit Cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా..? ఒకదాని బిల్లును మరో కార్డుతో చెల్లించడం మంచిదేనా..?
ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్ల రియాక్షన్స్ మామూలుగా లేవు. 'ఏం పనులమ్మా తల్లీ.. ఎంత పుట్టినరోజైతే మాత్రం ఇలాంటి వెర్రి వేషాలు అవసరమా?' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆమె బ్రతికుందా లేక పోయిందా' అని ఆమె చేసిన రిస్క్ ఎలాంటిదో కొందరు అంటున్నారు. ' ఆమె కనుక బ్రతికి ఉంటే ఇంకోసారి ఇలాంటి పని చేయదు' అని మరికొందరు అంటున్నారు. 'బహుశా ఆమె పుట్టినరోజు సందర్భంగా తాగినట్టుంది' అని అంటున్నారు.
Viral Video: ఆ తల్లి మనసు చిన్నపిల్లలా మారిపోయింది.. పుట్టినరోజుకు కొడుకు బహుమతి ఇస్తే ఆమె రియాక్షన్ ఇదీ..
Updated Date - 2023-08-31T14:36:51+05:30 IST