ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: 40 శాతం డిస్కౌంట్‌ ఉందని ఆన్‌లైన్‌లో డ్రైఫ్రూట్స్ ఆర్డర్ ఇస్తే.. ఏకంగా రూ.7 లక్షలు మటాష్.. ఆమె చేసిన తప్పేంటంటే..!

ABN, First Publish Date - 2023-07-27T10:11:30+05:30

ఆఫర్స్ అంటే ముఖ్యంగా మహిళలు చాలా ఆసక్తి చూపిస్తారు. ఓ మహిళ కుడా ఇలాగే డ్రైఫ్రూట్స్ ను ఆఫర్ లో కొందామని ప్రయత్నించి కానీ..

ప్రజలను అతిగా ఆకర్షించేవాటిలో ఆఫర్లు ముందు వరుసలో ఉంటాయి. తక్కువ డబ్బుతో నాణ్యమైన, విలువైన వస్తువులు వస్తాయంటే ప్రజలు ఎగబడతారు. మరీ ముఖ్యంగా మహిళలు ఆఫర్స్ మీద చాలా ఆసక్తి చూపిస్తారు. ఓ మహిళ కుడా ఇలాగే డ్రైఫ్రూట్స్ ను ఆఫర్ లో కొందామని ప్రయత్నించి బొక్కా బోర్లా పడింది. గోరంత ఆశకు పోతే కొండంత నష్టం జరిగిపోయిందంటూ వాపోతోంది. ముంబైలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ముంబైలోని(Mumbai) ములుంద్ ప్రాంతంలో నివసిస్తున్న 38ఏళ్ల గృహిణికి(38years hose wife) షాకింగ్ అనుభవం ఎదురైంది. మహిళ ఫేస్ బుక్(Face Book) లో పోస్ట్లు చూస్తున్న సమయంలో ఆమెను ఒక ప్రకటన విపరీతంగా ఆకర్షించింది. ఆ ప్రకటనలో ఎంతో మన్నికైన డ్రైఫ్రూట్స్ 40శాతం(dry fruits 40% discount) డిస్కౌంట్ ఉండటంతో ఆమెకు ఆసక్తి కలిగింది. వెంటనే ప్రకటనలో ఉన్న వాట్సప్ నెంబర్ ద్వారా అమ్మకం దారులను సంప్రదించింది. తనకు ఒక కిలో మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ కావాలని చెప్పింది. ఆ అమ్మకం దారులు ఆమెతో డ్రైఫ్రూట్స్ ఆర్డర్ కోసం మొదట ఆన్లైన్ లో అడ్వాన్స్ పేమెంట్ చేయాలని చెప్పారు. ఆ తరువాతే ఆర్డర్ కన్ఫామ్ అవుతుందని అన్నారు. ఆ మహిళ వారు చెప్పినట్టే 1,140రూపాలు ఆన్లైల్ లో చెల్లించింది. ఆమె డబ్బు చెల్లించిన వెంటనే ఆర్డర్ తొందరలోనే డెలివరీ చేస్తామని ఆమెకు మెసేజ్ వచ్చింది. అయితే కొన్ని గంటల్లో ఒక వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి 'కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీ ఆర్డర్ పూర్తీ కాలేదు. అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. మీ డబ్బు మీకు తిరిగి చెల్లిస్తాం' అని చెప్పాడు. దీంతో ఆమె తన ఆన్లైల్ పేమెంట్ అకౌంట్ వారికి చెప్పింది. కానీ సదరు వ్యక్తి ఆ మహిళతో 'నేను మీకు 1,140 పంపబోయి పొరపాటున 10వేలు పంపేశాను దయచేసి డబ్బు వెనక్కు పంపిస్తారా' అని అడిగాడు. ఆ మహిళ సరేనని డబ్బు పంపింది.

Aloe Vera Side Effects: కలబంద ఎంత మంచిదో అని అంతా అనుకుంటారు కానీ.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా..?



మహిళ డబ్బు వెనక్కు పంపిన కొంత సేపటి తరువాత సదరు వ్యక్తి మళ్లీ ఆమెకు ఫోన్ చేశాడు. 'మేడం మా సేల్స్ బిజీ ఉండటం వల్ల మేము పొరపాటున మీకు 49,999 రూపాయలు పంపాము దయచేసి మీరు విసిగించుకోకుండా ఆ డబ్బు వెనక్కు పంపగలరా' అని అడిగారు.దీంతో ఆ మహిళ వారికి మళ్లీ డబ్బు చెల్లించింది. ఇదంతా జరిగిన నాలుగు రోజుల తరువాత ఆ మహిళ తన బ్యాంక్ అకౌంట్ చెక్ చేయగా ఆమె అకౌంట్ కు ఎలాంటి డబ్బు జమకాలేదని అర్థమైంది. అంతా డ్రైఫ్రూట్స్ అమ్మకం పేరుతో దుండగులు చేసిన మోసమని తెలుసుకుంది. కానీ అప్పటికే ఆమె తనకు తెలియకుండానే 6.93లక్షలు దుండగులకు బదిలీ చేశానని గుర్తించింది. దుండగులు తెలివిగా ఆమె అకౌంట్ నుండి డబ్బు దోచుకున్నారని వాపోయింది. ముంబైలోని ములుంద్ పోలిస్టేషన్ చేరుకుని దుండగుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Fridge: ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. కొత్త ప్రిడ్జ్ కొనాల్సిందే.. ఫ్రిడ్జ్ పాడయిపోయిందని ఎలా గుర్తు పట్టాలంటే..!


Updated Date - 2023-07-27T10:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising