ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vomit Sensation While Journey: ప్రయాణాల్లో ఉండగా అసలు వాంతులు ఎందుకొస్తాయి..? చిన్న పిల్లలకు ఈ సమస్య రాకుండా ఉండాలంటే..!

ABN, First Publish Date - 2023-10-04T13:39:29+05:30

ప్రయాణాలలో వాంతులు కావడాన్ని మోషన్ సిక్ నెస్(motion sickness) అని అంటారు. ఇది పిల్లలలోనూ, కొంతమంది మహిళలలో కూడా ఉంటుంది. సింపుల్ టిప్స్ తో దీన్ని తగ్గించుకోవచ్చు.

ప్రయాణాల్లో వాంతులు అవ్వడం చిన్నతనంలో చాలామంది ఎదుర్కొనే ఉంటారు. ఈ కారణంగా అది ఎంత ఇబ్బంది పెడుతుందో పెద్దలకు తెలిసిందే. ఇలా ప్రయాణాలలో వాంతులు కావడాన్ని మోషన్ సిక్ నెస్(motion sickness) అని అంటారు. ఇది ఎవరికైనా వస్తుంది. మెదడుకు లోపలి చెవి భాగం, కళ్లు, శరీరం నుండి వ్యతిరేక సంకేతాలు అందినప్పుడు ఈ మోషన్ సిక్ నెస్ సమస్య వస్తుంది. పిల్లలు, కొంతమంది మహిళలు కూడా ఈ సమస్య వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని అధిగమించడానికి ఏం చేయాలంటే..

ప్రయాణంలో చాలామంది పిల్లలు మొబైల్ చూడటం, తినడం వంటి పనులు చేస్తుంటారు. కానీ దీనికి బదులుగా వారిని కిటికి నుండి బయటకు చూడమని ప్రోత్సహించాలి. చెట్లు, కొండలు, ప్రయాణం మధ్యలో వచ్చే ప్రాంతాలు, వాటి విశేషాలు ఇవన్నీ పిల్లలతో చెప్పాలి. ఈ చిట్కా శరీరంలో అవయవాలు సమంగా యాక్టీవ్ గా ఉండేలా చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా పిల్లలను ప్రయాణం మధ్యలో నిద్రపుచ్చడం కూడా ఈ సమస్యను అధిగమించడానికి మంచి మార్గం.

ప్రయాణాలకు ముందు పిల్లలకు తేలికపాటి ఆహారం ఇవ్వాలి. అతిగా ఆహారం ఇస్తే అది వాంతులు కావడానికి ఎక్కువ అవకాశాన్ని కలిగిస్తుంది.

ప్రయాణ సమయంలో పిల్లలకు గాలి బాగా తగిలేట్టు చూడాలి. దీనివల్ల వికారం కలగడమనే సమస్య రాదు.

Viral Video: ఎలా వస్తాయమ్మా.. ఇలాంటి ఐడియాలు.. ఈ మహిళ టీ ని ఎలా తయారు చేసిందో చూస్తే..!



ప్రయాణాల్లో విండో సీటు దొరకని పక్షంలో పిల్లల దృష్టిని మరల్చడం మంచి మార్గం. పిల్లలతో మాట్లాడటం, వారికి కథలు చెప్పడం, వారిని కథలు చెప్పమని అడగడం ఇవన్నీ చక్కని ఉపాయాలు.

వాంతి రాకుండా ఉండటానికి సువాసన చక్కగా సహకరిస్తుంది. నిమ్మకాయ నుండి పిప్పరమెంటు, అల్లం, ల్యావెండర్ మొదలైనవి దీనికి చక్కని పరిష్కారాలు. సహజసిద్దమైన పిప్పరమెంట్లు, క్యాండీలు చప్పరించడం కూడా ఈ సమస్య తగ్గిస్తాయి.

పిల్లల కోసం ఇన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా మోషన్ సిక్ నెస్ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. వారు చెప్పే విషయాలను పాటించాలి. మోషన్ సిక్ నెస్ కారణంగా పిల్లలు విపరీతమైన వాంతులతో బాధపడుతుంటే మాత్రం వారిని డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాలి.

7 Bad Habits: ఈ 7 చెడు అలవాట్లే మీ శరీరాన్ని రోగాలకు నిలయంగా చేస్తున్నాయని తెలుసా..? షుగర్ నుంచి గుండె సమస్యల వరకు..!


Updated Date - 2023-10-04T13:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising