Money: గంటలకొద్దీ కష్టపడకుండానే నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఛాన్స్.. ఇవి నేర్చుకుంటే బెటర్..!
ABN, First Publish Date - 2023-11-25T18:22:04+05:30
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనా సరళి మారిపోయింది. సోషల్ మీడియా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాదు.. డబ్బులు సంపాదనకు కూడా ఓ మంచి మార్గంగా మారింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైన సామాజిక మాధ్యమాల ద్వారా చాలా మంది ఇళ్లలో ఉండే బాగా సంపాదిస్తున్నారు.
సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనా సరళి మారిపోయింది. సోషల్ మీడియా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాదు.. డబ్బుల సంపాదనకు కూడా ఓ మంచి మార్గంగా మారింది. యూట్యూబ్ (Youtube), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మొదలైన సామాజిక మాధ్యమాల ద్వారా చాలా మంది ఇళ్లలో ఉండే బాగా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ నుంచి చాలా మంది పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు (Earning from Youtube). మీరు కూడా ఇలా చేయాలనుకుంటే మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలి.
మీరు ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించడానికి యూట్యూబ్ మంచి మార్గం. అందుకోసం మీరు ముందుగా వీడియో రికార్డింగ్ (Video Recording) నేర్చుకోవాలి. ట్రెండింగ్ టాపిక్స్ లేదా ఆసక్తికర విషయాల గురించి వీడియోలు రూపొందించాలి. కేవలం ఓ స్మార్ట్‌ఫోన్ సహాయంతో వీడియోలను రూపొందించి వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. అలాగే వీడియో ఎడిటింగ్ (Video Editing) కూడా నేర్చుకుంటే మరింత మంచిది. కంప్యూటర్ సహాయంతో చక్కగా ఎడిట్ చేసిన వీడియోలను అప్‌లోడ్ చేసుకోవాలి.
Viral Video: పాపం.. 21 ఏళ్ల ఈ యువతికి ప్రతిరోజూ నరకమే.. ఏది తిన్నా అలెర్జీ.. ఈమె ట్రీట్మెంట్ వీడియోను చూస్తే..!
యూట్యూబ్‌లో మీ వ్యూస్, లైక్స్‌ను బట్టి మీ వీడియోకు ప్రకటనలు (Youtube Ads) వస్తాయి. అందుకు కొంచెం సమయం పట్టవచ్చు. వ్యూయార్స్ వచ్చే వరకు నిరాశపడకుండా వీడియోలు రూపొందిస్తూ ఉండాలి. ఇందుకు రోజులో కొన్ని గంటలు వెచ్చిస్తే చాలు. మీకు ఏ విషయంపై అవగాహన ఉందో, ఏ విషయంలో మీరు ఎక్స్‌పర్ట్ అనేది తెలుసుకుని ఆయా అంశాలపై వీడియోలు రూపొందించాలి. అది వంటలైనా, వ్యవసాయం అయినా, టెక్నాలజీ అయినా.. ఆసక్తికరంగా ఉంటే చాలు. కొన్ని నెలల్లోనే మీరు మంచి ఆదాయం సంపాదించవచ్చు.
Updated Date - 2023-11-25T18:22:06+05:30 IST