ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బిడ్డ జోలికి వస్తే ఏ తల్లయినా ఊరుకుంటుందా..? నీళ్లలో ఉన్న మొసలినే భయపెట్టి పారిపోయేలా చేసిన ఏనుగు..!

ABN, First Publish Date - 2023-04-15T14:20:10+05:30

నీటిలో ఉన్న మొసలికి బలం ఎక్కువ. ఆ బలం ముందు ఏనుగు కూడా బలహీనంగానే మారుతుంది. నీటిలో మొసలికి చిక్కిన ఓ ఏనుగు తనను కాపాడమని విష్ణుమూర్తికి మొరపెట్టుకునే పద్యం మనందరికీ తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నీటిలో ఉన్న మొసలికి (Crocodile) బలం ఎక్కువ. ఆ బలం ముందు ఏనుగు (Elephant) కూడా బలహీనంగానే మారుతుంది. నీటిలో మొసలికి చిక్కిన ఓ ఏనుగు తనను కాపాడమని విష్ణుమూర్తికి మొరపెట్టుకునే పద్యం మనందరికీ తెలిసిందే. అయితే తన బిడ్డ ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మాత్రం ఆ ఏనుగు ఎవరి కోసమూ ఎదురు చూడలేదు. నేరుగా మొసలితో పోరాడి తరిమి కొట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఏనుగు తన బిడ్డతో కలిసి ఓ మడుగులో స్నానం చేస్తోంది. సరిగ్గా ఆ సమయంలో ఓ మొసలి చిన్న ఏనుగుకు దగ్గరగా వచ్చింది. మొసలిని గమనించిన పెద్ద ఏనుగు వెంటనే ముందుకు కదిలింది. ఆ మొసలిపై దాడికి దిగి దానిని నిలువరించింది. కాలితో ఆ మొసలిని తన్నేసింది. ఆ ఏనుగుతో పోరాడలేక మొసలి ఒడ్డు ఎక్కి బయటకు వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

Viral Video: ఇదేందయ్యా బాబూ.. వీళ్లకు పిచ్చేమైనా పట్టిందా..? లేక జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారా.? గుర్రంపై వరుడిని కూర్చోబెట్టి మరీ..

ఈ వీడియోను IFS అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ``తన బిడ్డను కాపాడుకునేందుకు ఏమైనా చేసేందుకు ఆ ఏనుగు వెనుకాడదు. ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే``నని సుశాంత కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తక్కువ సమయంలోనే 5 వేలకు పైగా లైక్‌లు దక్కించుకుంది.

Updated Date - 2023-04-15T14:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising