పుచ్చకాయలోని గింజలు మెత్తటి గుజ్జులోనే ఉన్నప్పటికీ అవి ఎందుకు మొలకెత్తవంటే... దీని వెనుక శాస్త్రీయ కారణమిదే!
ABN, First Publish Date - 2023-04-10T11:55:31+05:30
పుచ్చకాయను ఆంగ్లంలో వాటర్ మెలాన్(watermelon) అంటారు. పుచ్చకాయ శాస్త్రీయ నామం Citullus lanatus, ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది. పుచ్చకాయ ఒక రసవంతమైన పెపో పండు.
పుచ్చకాయను ఆంగ్లంలో వాటర్ మెలాన్(watermelon) అంటారు. పుచ్చకాయ శాస్త్రీయ నామం Citullus lanatus, ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది. పుచ్చకాయ ఒక రసవంతమైన పెపో పండు. దాని తినదగిన భాగం మెసోకార్ప్(Mesocarp). పెపో అంటే గట్టిగా ఉండే కవచం, దాని మధ్యలో కండకలిగిన గుజ్జు, అనేక గింజలు(seeds) కలిగిన పండు అని అర్థం. పుచ్చకాయ విత్తనం బయటి భాగం చాలా గట్టిగా ఉంటుంది. అందుకే పుచ్చకాయ రసంలో దాగున్నా విరగదు.
అది విరిగితే తప్ప, ఆ విత్తనం మొలకెత్తే అవకాశం ఉండదు. పుచ్చకాయలో 90 నుండి 95% నీరు(water) ఉంటుంది. వేసవిలో మన శరీరానికి ఎక్కువ నీరు అవసరం. ఈ పుచ్చకాయ ఆ లోటును భర్తీ చేస్తుంది. కాగా విత్తనాల అంకురోత్పత్తి(Germination)కి నీటితో పాటు, ఆక్సిజన్, సరైన ఉష్ణోగ్రత, నేలతో సహా అనేక ఇతర అనుకూలమైన పరిస్థితులు(conditions) ఎంతో అవసరం. ఇవేవీ లేనందునే పుచ్చకాయలోని గింజలు దానిలోనే మొలకెత్తవు.
Updated Date - 2023-04-10T12:45:35+05:30 IST