Crime: నిన్ను మా కూతురిలా భావించాము.. మా కొడుకును ఎందుకిలా చేశావంటూ.. నిలదీసిన తల్లిదండ్రులు.. అసలేం జరిగిందంటే..!
ABN, First Publish Date - 2023-11-06T16:02:19+05:30
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కాన్పూర్‌లో కొద్ది రోజుల కిందట జరిగిన ఓ దారుణ హత్య తీవ్ర సంచలనం కలిగించింది. తన దగ్గరకు ట్యూషన్‌కు వస్తున్న ఓ 16 ఏళ్ల బాలుడు కుశాగ్రను మహిళ టీచర్ రచిత తన ప్రియుడితో కలిసి హత్య చేసింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కాన్పూర్‌లో కొద్ది రోజుల కిందట జరిగిన ఓ దారుణ హత్య తీవ్ర సంచలనం కలిగించింది. తన దగ్గరకు ట్యూషన్‌కు వస్తున్న ఓ 16 ఏళ్ల బాలుడు కుశాగ్రను మహిళ టీచర్ రచిత తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. టీచర్ చేతిలోనే తమ కొడుకు హత్యకు గురయ్యాడనే సంగతి తెలిసి ఆ బాలుడి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. పోలీసు కస్టడీలో ఉన్న ఆ టీచర్‌తో మాట్లాడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు (Crime News).
``రచిత మాకు ఏడేళ్లుగా తెలుసు. కుశాగ్రకు 9ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆమె ట్యూషన్ చెబుతోంది. ఆమె అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. ఆమెను మా కూతురిలాగానే భావించేవాళ్లం. ఆమెను ఎంతగానో నమ్మాం. నా బిడ్డ చావుకు ఆమె కారణమని తెలిసినపుడు నమ్మలేకపోయా. ఆమె ఎందుకిలా చేసిందో అర్థం కావడం లేదు. ఆమెను ఒకసారి కలవాలని ఉంది. కుశాగ్రను ఎందుకు చంపిందో అడుగుతా. ఆమెకు మేం చేసిన ద్రోహం ఏంటో తెలుసుకుంటాన``ని కుశాగ్ర తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
Coffee: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ కుక్కర్ కాఫీని ఒకసారి తాగి చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!
కాన్పూర్ (Kanpur)కు చెందిన వస్త్ర వ్యాపారి మనీష్ కనోడియా కుమారుడు కుశాగ్రా గత నెల 30వ తేదీ సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాపర్లు మనీష్‌కు ఫోన్ చేసి రూ.30 లక్షలు ఇస్తేనే కుషాగ్రాను వదులుతామని బెదిరించారు. మనీష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమను పట్టుకుంటారనే భయంతో కిడ్నాపర్లు ఆ కుర్రాడిని చంపేసి మృతదేహాన్ని ఓ ఇంట్లో దాచారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కుశాగ్రా ట్యూషన్ సెంటర్ సమీపంలోని ఇళ్లలో సోదాలు నిర్వహించారు. చివరకు ఓ ఇంట్లో కుశాగ్రా మృతదేహం కనిపించింది. విచారించగా ఆ ఇల్లు ట్యూషన్ టీచర్ రిచిత బాయ్‌ఫ్రెండ్‌దని తేలింది. దీంతో అసలు విషయం బయటపడింది. డబ్బుల కోసం కుశాగ్రకు ట్యూషన్ చెబుతున్న మహిళా టీచర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వెలుగులోకి వచ్చింది.
Updated Date - 2023-11-06T16:02:22+05:30 IST