ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup2023: పెళ్లి తర్వాతైనా చూడొచ్చు.. ముందు మ్యాచ్ చూడాలి.. పెళ్లి వేడుకలో అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!

ABN, First Publish Date - 2023-11-17T17:08:17+05:30

ప్రస్తుత ప్రపంచకప్ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుండడంతో అభిమానుల ఆనందానికి అంతే లేకుండాపోతోంది. టీమిండియా మ్యాచ్‌లు జరుగుతున్న రోజున రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోతున్నారు.

ప్రస్తుత ప్రపంచకప్ (World Cup2023) క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా టీమిండియా (Team India)అద్భుత ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుండడంతో అభిమానుల ఆనందానికి అంతే లేకుండాపోతోంది. టీమిండియా మ్యాచ్‌లు జరుగుతున్న రోజున రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. అభిమానులందరూ (Cricket Fans) టీవీలకు అతుక్కుపోతున్నారు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లి (Wedding) వేడుకలో అతిథుల కోసం భారీ ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేసి మరీ మ్యాచ్‌ను ప్రదర్శించారు.

indian_cricketer_player అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వివాహ వేదిక వద్ద పెద్ద ప్రొజెక్టర్‌పై భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ ప్రసారమవుతోంది. వివాహ వేడుకకు హాజరైన అతిథులందరూ మ్యాచ్‌ చూస్తున్నారు. పూజారీ, వధూవరులు, కుటుంబ సభ్యులు మాత్రమే వివాహ కర్మలలో నిమగ్నమై ఉన్నారు. మిగిలిన వారందరూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌పైనే దృష్టి సారించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).

Viral Video: వారెవ్వా.. ఏం ట్యాలెంట్ తల్లీ.. సైకిల్‌పై వెళ్తూనే ఆమె చేసిన ఫీట్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!

ఈ వీడియోకు 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 9 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``మ్యాచ్ ముఖ్యం సోదరా.. పెళ్లి తర్వాతైనా చేసుకోవచ్చు``, ``పెళ్లిి వచ్చిన అతిథులను నిశ్శబ్దంగా ఉంచడానికి ఇది మంచి మార్గం``, ``పెళ్లిలో ఎలాంటి గొడవలూ జరగవు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-17T17:08:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising