విద్యార్థులకు శుభవార్త: ‘ఎంజాయ్’ చేసేందుకు వారం రోజులు సెలవులు... హోమ్‌వర్క్ ఏమిచ్చారో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-04-03T08:21:52+05:30
ఎన్‌బీసీ న్యూస్ నివేదిక ప్రకారం చైనాలోని కొన్ని కళాశాలల్లో రొమాన్స్(Romance) చేసేందుకు విద్యార్థులకు ఏప్రిల్ 1 నుండి 7 వరకు వారంపాటు ప్రత్యేక సెలవులు(Special holidays) ఇచ్చారు.
ఎన్‌బీసీ న్యూస్ నివేదిక ప్రకారం చైనాలోని కొన్ని కళాశాలల్లో రొమాన్స్(Romance) చేసేందుకు విద్యార్థులకు ఏప్రిల్ 1 నుండి 7 వరకు వారంపాటు ప్రత్యేక సెలవులు(Special holidays) ఇచ్చారు. ఫ్యాన్ మెయి ఎడ్యుకేషన్ గ్రూప్‌లోని తొమ్మిది కళాశాలల్లో, మియాయాంగ్ ఫ్లయింగ్(Miaoyang Flying) ఒకేషనల్ కాలేజీ ఈ విధమైన సెలవులు ఇచ్చారు.
ఈ సెలవుల్లో విద్యార్థులు రొమాన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సివుంటుంది. మియాయాంగ్ ఫ్లయింగ్ వొకేషనల్ కాలేజీ డిప్యూటీ డీన్ ఒక ప్రకటనలో.. ఈ సెలవుల్లో విద్యార్థులు(students) అందమైన, పచ్చని పర్వతాలను చూడటానికి వెళ్లి ఎంజాయ్(enjoy) చేయాలని కోరారు. తద్వారా వారు ప్రకృతిని పూర్తిగా అనుభవించగలరన్నారు. ఇది విద్యార్థుల ఆహ్లాదకర భావాలను పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా వారిలో ప్రకృతి(nature) పట్ల ప్రేమను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. వారి ప్రేమ ఫలించాక వారు తిరిగి తరగతి గదికి వచ్చినప్పుడు వారి విద్యా సామర్థ్యం(ability) మెరుగుపడుతుందన్నారు.
కాగా దేశంలో జననాల రేటు పడిపోవడంపై చైనా చాలా ఆందోళన చెందుతోంది. అక్కడి ప్రభుత్వ(Govt) రాజకీయ సలహాదారులు కూడా జననాల రేటు పెంచాలని సిఫార్సులు చేశారు. జననాల రేటు(Birth rate)ను పెంచడానికి చైనాలో ఇప్పటికే అనేక పథకాలు ప్రారంభించారు. ఇందులో కొత్తగా పెళ్లయిన జంటకు ఒక నెల వేతనంతో కూడిన సెలవు(Leave with pay) ఇవ్వాలనే నిబంధన విధించారు.
ఈ క్రమంలోనే ప్రేమికులతో గడిపేందుకు కాలేజీ విద్యార్థులకు సెలవు ఇచ్చారు. అయితే విద్యార్థులు ఈ సెలవు రోజుల్లో వారు ఎంజాయ్(enjoy) చేసిన అనుభవాలను తప్పనిసరిగా డైరీ(Diary)ల్లో రాయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో వారి ప్రయాణానికి సంబంధించిన వీడియోలను(videos) రూపొందించాలని కోరారు.
Updated Date - 2023-04-03T08:24:50+05:30 IST