ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dimple Vs DCP : డింపుల్ హయాతీ వర్సెస్ డీసీపీ ఎపిసోడ్‌లో రెండు నెలలుగా అసలేం జరిగింది.. హీరోయిన్ ఏం చేయబోతున్నారు..!?

ABN, First Publish Date - 2023-05-23T17:24:05+05:30

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ (Dimple Hayati ) వర్సెస్ డీసీపీ రాహుల్ హెగ్డే (DCP Rahul Hegde) ఎపిసోడ్‌లో గంటకో కొత్తకోణం వెలుగు చూస్తోంది. ఇవాళ ఉదయం నుంచి ఈ వ్యవహారంలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ (Dimple Hayati ) వర్సెస్ డీసీపీ రాహుల్ హెగ్డే (DCP Rahul Hegde) ఎపిసోడ్‌లో గంటకో కొత్తకోణం వెలుగు చూస్తోంది. ఇవాళ ఉదయం నుంచి ఈ వ్యవహారంలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇద్దరి మధ్య అసలేం జరిగింది..? గొడవ ఎక్కడ మొదలైంది..? ఇద్దరిలో తప్పెవరిది..? అనే విషయాలపై మాత్రం ఇంతవరకూ క్లారిటీ రాలేదు. దీంతో డింపుల్ వర్సెస్ డీసీపీ (Dimple Vs DCP ) ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయాలను హీరోయిన్ లాయర్ పాల్ సత్యనారణ మీడియాతో మాట్లాడుతూ పూసగుచ్చినట్లుగా చెప్పేశారు. అంతేకాదు.. అటు డింపుల్ .. ఇటు డీసీపీ ఏ ఒక్కరూ తగ్గట్లేదు. డింపుల్ ట్వీట్లతో హోరెత్తిస్తుండగా.. డీసీపీ మీడియా ముందుకొచ్చి జరిగిన గొడవ ఇదేనంటూ చెబుతున్నారు. ఇంతకీ డీసీపీ వర్సెస్ డింపుల్ ఎపిసోడ్‌లో అసలేం జరిగింది..? ఎవరేం చెబుతున్నారు..? ఈ మొత్తం వ్యవహారంపై డింపుల్ ఏం చేయబోతున్నారనే విషయాలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

అసలేం జరిగింది.. ఎక్కడ చెడింది..!?

డింపుల్ లాయర్ పాల్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ గత రెండు నెలలుగా అసలేం జరిగిందో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారు. రోడ్డు మీద ఉండే సిమెంట్ బ్రిక్స్ ప్రైవేట్ అపార్ట్మెంట్‌లోకి ఎలా వచ్చాయి..?. ఇదే విషయాన్ని 2 నెలలుగా అడుగుతున్నాం. డింపుల్‌తో డీసీపీ.. చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారు. డింపుల్ పార్కింగ్ ప్లేస్‌లో ట్రాఫిక్ కోన్స్ పెట్టారు. డింపుల్ ఒక సెలబ్రిటీ.. చాలాసార్లు చెప్పినా వినకపోవడంతో అసహనంతో కోన్స్‌ని కాలుతో తన్నారు. డీసీపీపై డింపుల్ కేసు పెడతానని బెదిరించడంతో.. ఉల్టాగా డింపుల్‌పై డీసీపీ కేసు పెట్టారు. వేధించాలి అనేదే డీసీపీ ఉద్దేశం. క్వార్టర్స్‌లో ఉండకుండా డీసీపీ ఇక్కడ ఎందుకు ఉన్నారు..?. సిమెంట్ బ్రిక్స్ తేవాలంటే.. చిన్న క్రేన్‌తో తేవాలి. ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్‌లోకి వాటిని ఎలా తెస్తారో ముందు చెప్పాలి..?. ప్రభుత్వ ప్రాపర్టీని డీసీపీ తప్పుగా వాడుతున్నారు. ఒక డీసీపీ స్థాయి వ్యక్తి.. ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలియదా..?. అమ్మాయి మీదకి వెళ్ళి మాట్లాడతారా..?. ఒక సెలబ్రిటీగా, ఒక అమ్మాయిగా, అందులోనూ పోలీస్ ఆఫీసర్‌పై కేసు పెట్టేందుకు డింపుల్ వెనుకాడారు. తీరా.. ఐపీఎస్ తన డ్రైవర్‌తో కేసు పెట్టించారు. డింపుల్ కూడా ఫిర్యాదు చేశారు.. కానీ పోలీసులు తీసుకోలేదు. 4 గంటలు పాటు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కూర్చోబెట్టారు. మేం న్యాయపరంగా పోరాటం చేస్తాంఅని డింపుల్ లాయర్ సత్యనారాయణ మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు.

గొడవ మొత్తమ్మీద..!

కాగా.. అంతకుముందు డింపుల్ వర్సెస్ డీసీపీ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ బయటపడింది. దీంతో ఈ ఇద్దరి మధ్య వివాదం మరింత రాజుకుంది. ఈ వివాదం మధ్యనే ఇవాళ ఉదయం నుంచి డింపుల్ ట్వీట్ల వర్షం కురిపిస్తోంది.ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై నా అభిమానుల ఆందోళన అర్థమవుతోంది. మీడియా ఆందోళనను కూడా నేను అర్థం చేసుకున్నాను. నాకు సహకరించిన, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనలు ఇవ్వలేదు. ఓపికగా వేచి ఉండాలని అభ్యర్థిస్తున్నానుఅని డింపుల్ టీమ్ మీడియాకు తెలిపింది. ఈ గొడవ మొత్తమ్మీద రోడ్డు పై ఉపయోగించే డివైడర్లను డీసీపీ ఉంటున్న అపార్ట్మెంట్‌లో ప్రత్యక్షమవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ట్రాఫిక్ లో పోలీసులు ఉపయోగించే సిమెంట్ దిమ్మెలు అపార్ట్మెంట్‌లో కారుకు అడ్డుపెట్టడాన్ని డింపుల్ హయాతీ తప్పు పడుతున్నారు. అధికార బలంతో తప్పులను కప్పిపుచ్చలేరని డింపుల్ ట్వీట్ చేశారు.

కోర్టుకు వెళ్లాలని నిర్ణయం..!

మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై కోర్టును ఆశ్రయించాలని డింపుల్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. నా మీద తప్పుడు కేసు పెట్టారు. కావాలనే నా కారుపై పోలీసులు చలాన్లు వేస్తున్నారు. నేను కోర్టులోనే తేల్చుకుంటాను. నేను డీసీపీని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. పబ్లిక్ ప్రాపర్టీని తీసుకొచ్చి ప్రైవేట్ ప్రాపర్టీలో పెట్టారు. డీసీపీ కారు కోసం ట్రాఫిక్ కోన్స్ తెచ్చిపెట్టారు. ఎంత ఐపీఎస్, ట్రాఫిక్ పోలీసు ఆఫీసర్ అయితే మాత్రం ట్రాఫిక్ కోన్స్‌ను ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఎలా పెడతారు..?. నేను నా కారుతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టలేదు. డీసీపీ కారుకు ఎక్కడైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు. నా కారుతో ఢీ కొడితే రెండు వైపులా డ్యామేజ్ ఉండాలి కదా..?. నేను తెలుగు అమ్మాయినే. గన్‌మెన్లను పెట్టుకుని ఉన్న అంతపెద్ద ఆఫీసర్లను నేనేం చేస్తాను. కేసు కోర్టు వరకు వెళ్లాక అన్ని వివరాలు మీడియాకు చెబుతాను అని డింపుల్ స్పష్టం చేశారు.

నేనే వెళ్లి రెక్వెస్ట్ చేశాను..!

డింపుల్ వ్యాఖ్యలపై ఐపీఎస్ రాహుల్ హెగ్డే స్పందించారు. నేను, డింపుల్ ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. నా కారుకు అడ్డంగా డింపుల్ కారు పెట్టారు. నాకు అర్జెంట్‌గా బయటికి వెళ్లే పని పడింది. నేను వ్యక్తిగతంగా వెళ్లి కారు తీయాలని రెక్వెస్ట్ చేశాను. నా కారును ఢీకొట్టి, కాళ్లతో తన్నింది. నాపట్ల డింపుల్ ప్రవర్తనతీరు తీవ్ర అభ్యంతరకరం. నా డ్రైవర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అని రాహుల్ మీడియాకు వెల్లడించారు.

మొత్తానికి చూస్తే.. ఇప్పట్లో డింపుల్ వర్సెస్ డీసీపీ గొడవకు ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. పోలీసుల తీరుపై కోర్టుకెళ్తానని డింపుల్‌ చెబుతుండగా.. మొత్తం చేసింది డింపులేనని డీసీపీ చెబుతున్నారు. కోర్టు ఏం తేలుస్తుందో.. ఫైనల్‌గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash CBI Enquiry : విచారణకు రాలేనన్న ఎంపీ అవినాష్.. హుటాహుటిన కర్నూల్‌కు సీబీఐ బృందం.. ఏం జరుగుతుందో అని వైసీపీలో నరాలు తెగే ఉత్కంఠ..!

******************************

Avinash Vs CBI : ‘తగ్గేదేలే’.. రావాల్సిందే అంటున్న సీబీఐ.. విచారణ నుంచి తప్పించుకోవడానికి ఎంపీ అవినాష్ ప్లాన్ ఇదేనా..!

******************************

YSRCP : ఎంపీ వల్లభనేని బాలశౌరికి సొంత పార్టీ నుంచే ఇంత అవమానమా.. ఈ ఇన్విటేషన్ చూశాక ముఖ చిత్రమేంటో..!


*****************************

Updated Date - 2023-05-23T17:44:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising