భార్య డెలివరీ కోసమని ఆస్పత్రికి వెళ్తే ఇలా జరిగిందేంటి..? రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి వచ్చి..
ABN, First Publish Date - 2023-02-04T16:08:45+05:30
అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి.. వారు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మొద్దు.. అని పదే పదే పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా చాలా మంది తరచూ మోసపోతూనే ఉంటారు. రాజస్థాన్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ వ్యక్తి..
అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి.. వారు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మొద్దు.. అని పదే పదే పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా చాలా మంది తరచూ మోసపోతూనే ఉంటారు. రాజస్థాన్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ వ్యక్తి భార్య డెలివరీ కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి 11గంటల సమయంలో ఆస్పత్రి ఆవరణలో ఉన్న తండ్రీ కొడుకుల వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. వారితో సరదాగా మాటలు కలిపాడు. కాసేపటి తర్వాత జరిగిన ఏం జరిగిందో తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) జైపూర్ పరిధి ఘాట్‌గేట్‌కు చెందిన సహీమ్ అనే వ్యక్తి.. తన భార్యతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. ఇదిలావుండగా, గర్భిణిగా ఉన్న సహీమ్ భార్యకు శుక్రవారం పురటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాత్రి భార్య వద్ద తల్లిని ఉంచి.. సహీమ్, అతడి తండ్రి అబ్ధుల్ హమీమ్.. ఆస్పత్రి ఆవరణలో పడుకున్నారు. అయితే రాత్రి 11గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వారి వద్దకు వచ్చి మాటలు కలిపాడు. తాను అదే ఆస్పత్రికి వచ్చానంటూ వారితో పరిచయం చేసుకుని కాసేపు సరదాగా మాట్లాడాడు. తర్వాత వారికి మత్తు మందు కలిపిన టీ (Drugged tea) తెచ్చించాడు. టీ తాగిన కొద్ది సేపటికి సహీమ్, అతడి తండ్రి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
తర్వాత వారి వద్ద ఉన్న ఫోన్లు, రూ.8వేల నగదును (theft) ఎత్తుకెళ్లాడు. అదే రోజు రాత్రి సహీమ్ భార్య.. కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని చెప్పేందుకు సహీమ్ తల్లి.. ఆస్పత్రి బయటకు వచ్చింది. కొడుకు, భర్తకు ఫోన్ చేసినా అందుబాటులో లేకపోవడంతో ఆవరణ మొత్తం వెతికింది. పార్కింగ్ దగ్గర ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసి షాక్ అయింది. వెంటనే తన చిన్న కొడుక్కి సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న అతను.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. స్పృహలోకి వచ్చిన ఇద్దరూ జరిగిన విషయాన్ని తెలియజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టు పక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Viral Video: వృద్ధురాలికి ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న కొండముచ్చు.. ఏం చేసిందో చూడండి..
Updated Date - 2023-02-04T16:09:56+05:30 IST