ప్రీమియం తత్కాల్ టిక్కెట్ అంటే ఏమిటి? దీనికి తత్కాల్‌కు తేడా ఏమిటి? ధరల్లో ఎంత ఏడా ఉంటుందంటే...
ABN, First Publish Date - 2023-03-30T11:09:08+05:30
premium tatkal ticket: భారతీయ రైల్వేలు తత్కాల్ సదుపాయాన్ని పోలి ఉండే మరో కొత్త కోటాను ప్రారంభించింది. ఈ ప్రీమియం తత్కాల్(Premium Tatkal) కోటాలో కూడా తత్కాల్ మాదిరిగానే బుకింగ్ చేస్తారు.
premium tatkal ticket: భారతీయ రైల్వేలు తత్కాల్ సదుపాయాన్ని పోలి ఉండే మరో కొత్త కోటాను ప్రారంభించింది. ఈ ప్రీమియం తత్కాల్(Premium Tatkal) కోటాలో కూడా తత్కాల్ మాదిరిగానే బుకింగ్ చేస్తారు. దీని బుకింగ్(Booking) కూడా తత్కాల్ మాదరిగా ఒక రోజు ముందు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఏసీ క్లాస్(AC class) టిక్కెట్ల బుకింగ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. నాన్ ఏసీ క్లాస్ టిక్కెట్ల కోసం ఉదయం 11 గంటల నుంచి బుకింగ్ ప్రారంభమవుతుంది.
దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో డైనమిక్ ధరలు(Dynamic pricing) ఉంటాయి. అంటే రైలు ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఇందులో తత్కాల్ టిక్కెట్ బుకింగ్ కంటే ఎక్కువ ధర ఉంటుంది. ఇది ఇన్‌స్టంట్(Instant)గా ఉన్నప్పుడు దీనిలోని ప్రత్యేకతలు ఏమిటనే ప్రశ్న మనలో మెదులుతుంది. తత్కాల్ టిక్కెట్ల ధరలు స్థిరంగా ఉంటాయి.
కిలోమీటర్(Kilometer) లేదా తరగతి ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే ప్రీమియం తత్కాల్ కేటగిరీలో ఇది భిన్నంగా ఉంటుంది. దీనిలో ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఇందులో తత్కాల్ కంటే ఈ టికెట్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టిక్కెట్‌ను ఐఆర్సీటీసీ(IRCTC) అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవచ్చు, తత్కాల్‌ను ఐఆర్సీటీసీ కాకుండా అనేక వెబ్‌సైట్(Website)ల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. దాని విండో తక్షణమే తెరుచుకుంటుంది. ఇందులో వినియోగదారులకు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి సమయం లభిస్తుంది. దీనిని బుకింగ్ చేయడానికి నియమాలు(Rules) తత్కాల్ బుకింగ్ మాదిరిగానే ఉంటాయి. అధికారిక వెబ్‌సైట్ నుండి మాత్రమే బుక్ చేసుకోవచ్చు.
Updated Date - 2023-03-30T11:10:53+05:30 IST