ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'స్లీప్ డివోర్స్' అంటే ఏమిటి? ఈ తరహా విడాకులు తీసుకునేవారు ఏం చేయాలంటే...

ABN, First Publish Date - 2023-05-08T13:35:10+05:30

భార్యాభర్తలు(husband and wife) ఒకే మంచం మీద పడుకోవడం అనేది శృంగారానికే కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు(understand) కూడా అవకాశాన్ని కూడా కల్పిస్తుందంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తలు(husband and wife) ఒకే మంచం మీద పడుకోవడం అనేది శృంగారానికే కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు(understand) కూడా అవకాశాన్ని కూడా కల్పిస్తుందంటారు. అయితే ఇటీవలి కాలంలో 'స్లీప్ డివోర్స్'('Sleep Divorce') అనేది ట్రెండింగ్‌గా మారింది. దంపతులు విడిగా పడుకోవడమే ఈ నూతన ట్రెండ్(new trend). ఇది ఎందుకు అమలులోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రోజంతా పనిచేసిన తర్వాత ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటారు.

జంటలు ఇలా విడివిడిగా నిద్రపోవడానికి(sleep) అనేక కారణాలు ఉన్నాయి. భాగస్వామికున్న కొన్ని అలవాట్ల కారణంగా తోటి భాగస్వామి కలత చెందుతారు. ఇటువంటి అలవాట్లలో బిగ్గరగా గురక పెట్టడం(snoring) లేదా ఎక్కువ సేపు లైట్లు వేసుకుని మెలకువగా ఉండడం మొదలైనవి ఉంటాయి. పెళ్లయిన జంటలు ఇలా విడివిడిగా నిద్రించడాన్ని స్లీప్ డివోర్స్ అని అంటారు. ఇలా చేయడం వల్ల భాగస్వాములకు ప్రశాంతమైన నిద్ర(Peaceful sleep) వస్తుంది. కొన్ని జంటలు 'స్లీప్ డివోర్స్'తో కలిసి ఉంటారు. మంచి నిద్ర కోసం వారు వేర్వేరు గదులలో పడుకుంటారు. 'స్లీప్ డివోర్స్' అనేది జంట అవసరాన్ని అనుసరించి, దీర్ఘకాలికంగా లేదా తాత్కాలికంగా(Temporarily) ఉండవచ్చు.

'స్లీప్ డివోర్స్' ప్రయోజనాలు

ఇది దంపతుల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. జంటలు వారి వ్యక్తిగత స్వేచ్ఛను పొందుతారు. ఓపెన్ బెడ్(Open bed) అనేది మంచి నిద్రను ఇస్తుంది. ఆరోగ్యకరమైన దాంపత్య సంబంధానికి ఒకే మంచం మీద పడుకోవలసిన అవసరం లేదు, జంటలు ఒకే మంచం మీద పడుకోకుండానే సాన్నిహిత్యాన్ని(Intimacy) పెంపొందింపజేసుకోవచ్చు.

'స్లీప్ డివోర్స్' ఎందుకు మంచిదంటే..

ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి నిద్ర చాలా ముఖ్యం. అందుకే 'స్లీప్ డివోర్స్' అవసరం ఎంతైనా ఉంది. భాగస్వామి అలవాట్ల కారణంగా తోటి భాగస్వామి నిద్ర విషయంలో రాజీ పడుతుంటే, అందుకు 'స్లీప్ డివోర్స్'('Sleep Divorce') ఒక ఎంపికగా చూడటం తప్పు కాదు.

'స్లీప్ డివోర్స్' కారణంగా భార్యాభర్తల సంబంధం దెబ్బతినదు. ఇలా విడివిడిగా నిద్రపోవడం అనేది దంపతుల ఇష్టాష్టాలపై ఆధారపడి ఉంటుంది. దంపతుల పరస్పర అంగీకారం(acceptance), అవగాహనతో ఒకరి అవసరాలను మరొకరు గౌరవించాలి.

కొన్ని గంటలపాటు ఎలాంటి నిద్రా భంగం(Sleep disturbance) లేకుండా గాఢమైన నిద్రను పొందేందుకే 'స్లీప్ డివోర్స్' విధానం వచ్చింది.

Updated Date - 2023-05-08T13:35:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising