ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశంలో అద్భుతం... ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసిన జనం... దీనివెనుక కథనం ఇదే..!

ABN, First Publish Date - 2023-04-30T09:17:57+05:30

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మొన్న శుక్రవారం( ఏప్రిల్ 28)నాడు సూర్యుని చుట్టూ వృత్తాకారం కనిపించింది. ఈ దృశ్యం అద్భుతంగా ఉండటంతో చాలామంది ఆ ఫొటోలను తీసి సోషల్ మీడియా(Social media)లో షేర్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మొన్న శుక్రవారం( ఏప్రిల్ 28)నాడు సూర్యుని చుట్టూ వృత్తాకారం కనిపించింది. ఈ దృశ్యం అద్భుతంగా ఉండటంతో చాలామంది ఆ ఫొటోలను తీసి సోషల్ మీడియా(Social media)లో షేర్ చేశారు. అయితే సూర్యుని చుట్టూ ఇది ఎందుకు ఏర్పడింది? ఇది సూర్యుని విషయంలో మాత్రమే జరుగుతుందా లేదా చంద్రునితో కూడా జరుగుతుందా లేదా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్రవారం ఉదయం చాలామంది నిద్ర నుండి మేల్కొని ఆకాశాన్ని చూసినప్పుడు, వారికి సూర్యుని చుట్టూ వృత్తాకారం(circular) కనిపించింది. ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఇది ఒక సాధారణ ఖగోళ దృగ్విషయం. దీనిని సైన్స్ భాషలో సోలార్ హాలో(Solar halo) లేదా సన్ రింగ్ అని కూడా పిలుస్తారు. వాతావరణంలో ఉండే షట్కోణ స్ఫటికాల కారణంగా ఇది జరుగుతుందని నిపుణులు(Experts) తెలిపారు. వాస్తవానికి వాతావరణంలో ఉన్న నీటి బిందువులపై కాంతి పడినప్పుడు ఈ దృగ్విషయం దాని రేడియేషన్(Radiation) కారణంగా సంభవిస్తుంది. ఈ వృత్తం అనేక రంగులతో ఇంద్రధనస్సు మాదిరిగానూ కనిపిస్తుంది. చంద్రుని విషయంలోనూ ఇది జరుగుతుంది.

దీనిని మూన్ హాలో(Moon Hollow) అని పిలుస్తారు. కొంతమంది దీనిని చంద్రుని ఉంగరం అని కూడా అంటారు. ఇది 2016, ఫిబ్రవరి 20న జరిగింది. అలాగే 2015 జూలై 20న ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రకాశించే లేదా శక్తితో కూడిన వస్తువు చుట్టూ వృత్తాకారం ఏర్పడినప్పుడు, దానిని హాలో అంటారు. ఇది ఆధ్యాత్మికత విషయంలోనూ ప్రస్తావిస్తారు. దేవతల చిత్రాలలో వారి తల వెనుక మెరిసే వృత్తాకారాన్ని(Circular) రూపొందిస్తుంటారు.

Updated Date - 2023-04-30T10:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising