ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heat Wave: ఏ స్థాయి ఉష్ణోగ్రతలను వడగాలులు అని అంటారు? ఏ సమయంలో ఇవి ఏర్పడతాయంటే...

ABN, First Publish Date - 2023-04-25T12:38:34+05:30

Heat Wave: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంవత్సరంలో మార్చి నెల నుండే వేసవి విధ్వంసం కొనసాగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల(Temperatures) కారణంగా వడగాలులు వీచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Heat Wave: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంవత్సరంలో మార్చి నెల నుండే వేసవి విధ్వంసం కొనసాగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల(Temperatures) కారణంగా వడగాలులు వీచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి యేటా వడగాలుల పెరుగుతూనే ఉన్నాయి. హీట్ వేవ్ అంటే వడగాలి అనేది అత్యంత వేడి వాతావరణ పరిస్థితి. ఇది సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం మైదాన ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత(Maximum temperature) 40 ° సెంటీగ్రేడ్‌కు చేరుకున్నప్పుడు, తీర ప్రాంతాల ఉష్ణోగ్రత 37 ° సెంటీగ్రేడ్‌కు, కొండ ప్రాంతాల ఉష్ణోగ్రత 30 ° సెంటీగ్రేడ్‌కు చేరుకున్నప్పుడు వేడి గాలులు మొదలవుతాయి.

ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటే, అది ప్రమాదకరమైన హీట్ స్ట్రోక్(Dangerous heat stroke) కిందకు వస్తుంది. మనదేశంలో హీట్ వేవ్ పరిస్థితులు ప్రధానంగా మార్చి నుండి జూన్ వరకు కొనసాగుతాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో జూలైలో కూడా ఇటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. భారతదేశం(India)లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా మే నెలలో ఏర్పడతాయి.

హీట్ వేవ్ అనేది సాధారణంగా నిలిచిపోయిన గాలి కారణంగా ఏర్పడుతుంది. అధిక పీడన వ్యవస్థ(High pressure system) గాలిని కిందకి నెట్టివేస్తుంది. ఇది భూమిపైనున్న గాలి పైకి రాకుండా చేస్తుంది. కిందికి నెట్టుకువచ్చే గాలి ఒక టోపీలా ఏర్పడుతుంది. ఫలితంగా వేడి గాలి(hot air) ఒక చోట చేరుతుంది. కాగా గాలి వేడెక్కకుండా ఆపడానికి మార్గం లేదు.

Updated Date - 2023-04-25T12:39:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising