ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రికి అనారోగ్యం.. రూ.10 లక్షల జీతాన్నిచ్చే జాబ్‌ను వదిలేసి మరీ 23 ఎకరాల్లో ఓ యువతి వ్యవసాయం..!

ABN, First Publish Date - 2023-01-02T18:38:57+05:30

ఇతర రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగంలో (Farming) పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. పురుషులతో పోల్చుకుంటే మహిళల శారీరక శ్రమ చేయలేరనే భావన ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో మహిళలు కూడా వ్యవసాయంలో పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇతర రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగంలో (Farming) పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. పురుషులతో పోల్చుకుంటే మహిళల శారీరక శ్రమ చేయలేరనే భావన ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో మహిళలు కూడా వ్యవసాయంలో పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. విద్యావంతులు, కార్పొరేట్ ప్రపంచంలోని మహిళలు కూడా వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు చేస్తూ చాలా సంపాదిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువతి 10 లక్షల జీతాన్నిచ్చే జాబ్‌ను వదిలేసి మరీ వ్యవసాయం ప్రారంభించింది. స్థానికంగా 100 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) కురుదు గ్రామానికి చెందిన చెందిన స్మరిక అనే యువతి కంప్యూటర్ సైన్స్‌లో బీఈ చేసి ఆ తర్వాత ఎంబీఏ కూడా చేసింది. ఆమెకు ఒక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఏడాదికి రూ.10 లక్షలు జీతం. ఆమె తండ్రి 2020 జనవరిలో కాలేయ మార్పిడి చికిత్స చేయించుకున్నాడు. అతను ఎన్నో సంవత్సరాలుగా తనకున్న 23 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ స్థానికంగా చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అతడు అనారోగ్యం బారిన పడడంతో వారంతా ఆర్థిక కష్టాలకు లోనయ్యారు. విషయం తెలుసుకున్న స్మరిక తన ఉద్యోగానికి రాజీనామా చేసి తండ్రి వ్యవసాయం వ్యవసాయ బాధ్యతలు తీసుకుంది.

చిన్నప్పటి నుంచి తండ్రి పొలంలో పని చేయడం చూసింది కాబట్టి ఆమెకు వ్యవసాయంపై అవగాహన ఉంది. మొదట్లో ఇబ్బందులు పడినా నెమ్మదిగా నేర్చుకోవడం ప్రారంభించింది. మిర్చి, జామ, వెదురు, బొప్పాయి, కొబ్బరి, స్ట్రాబెర్రీ, కూరగాయల పంటలపై దృష్టి సారించింది. నాణ్యత కారణంగా ఢిల్లీ, యూపీ, ఆంధ్రా, కోల్‌కతా, బీహార్, ఒడిశా వరకు ఆమె తన ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది. కొత్త సంవత్సరంలో తమ ఉత్పత్తులను విదేశాలకు పంపించేందుకు కూడా స్మరిక సన్నాహాలు చేస్తోంది.

Updated Date - 2023-01-02T18:40:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising