ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: బాబోయ్.. ఇదెక్కడి ఆచారం.. అక్కడ కూతుళ్లను తండ్రులు పెళ్లి చేసుకుంటారట.. అసలు రహస్యం ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-12-05T19:26:44+05:30

జాతి, మతం, కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎవరికైనా పెళ్లి అనేది ఓ మధుర జ్ఞాపకం. రెండు కుటుంబాలను కలిపే ఓ గొప్ప వేడుక. ఈ ప్రపంచంలోని వివిధ సంస్కృతులలో వివిధ రకాలుగా వివాహాలు జరుగుతుంటాయి. పెళ్లిళ్లలో కొన్ని ఆచారాలు విని మనం ఆశ్చర్యపోతుంటాం.

జాతి, మతం, కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎవరికైనా పెళ్లి (Marriage) అనేది ఓ మధుర జ్ఞాపకం. రెండు కుటుంబాలను కలిపే ఓ గొప్ప వేడుక. ఈ ప్రపంచంలోని వివిధ సంస్కృతులలో వివిధ రకాలుగా వివాహాలు జరుగుతుంటాయి (Strange Weddings). పెళ్లిళ్లలో కొన్ని ఆచారాలు విని మనం ఆశ్చర్యపోతుంటాం. అయితే బంగ్లాదేశ్‌లోని (Bangladesh) ఓ గిరిజన తెగ ఆచారం గురించి వింటే మాత్రం నివ్వెరపోవాల్సిందే. ఎందుకంటే ఆ తెగలో అమ్మాయిలను తండ్రులే పెళ్లి చేసుకుంటారు (Father Marries Daughter).

బంగ్లాదేశ్‌లోని మండి తెగలో ( Mandi community) శతాబ్దాలుగా చాలా విచిత్రమైన ఆచారం కొనసాగుతోంది. కూతురు యుక్తవయస్సు వచ్చిన వెంటనే ఆమెకు ఆమె తండ్రి భర్త అవుతాడు. అయితే ఇందులో ఓ రహస్యం ఉంది. మండి తెగలోని ఎవరైనా మహిళ వితంతువు అయితే ఆమెను అదే తెగకు చెందిన మరో పురుషుడు వివాహం చేసుకుంటాడు. ఆ స్త్రీకి మొదటి వివాహం ద్వారా కూతురు ఉంటే.. ఆమె పెద్దయ్యాక సవతి తండ్రిని వివాహం చేసుకోవాలి. వితంతువును, ఆమె కూతురిని వేరే పురుషుడు పోషించేందుకు వీలుగా తెగ పెద్దలు ఈ నిబంధన పెట్టారట.

Viral: స్పేస్ కావాలన్న యువతి.. కీబోర్డ్‌లో అదే పెద్దదన్న కుర్రాడు.. షాదీ పోర్టల్‌లో ఫన్నీ ఛాటింగ్.. చివరకు..!

ఈ నిబంధన ప్రకారం స్వంత కూతురిని తండ్రి వివాహం చేసుకోడు. సవతి కూతురిని సవతి తండ్రి (Step Father) వివాహం చేసుకుంటారు. ఏదేమైనా ఓ బాలిక చిన్నప్పటి నుంచి నాన్న అని పిలిచిన వ్యక్తిని పెద్దయ్యాక పెళ్లి చేసుకోవాలి. అతడు ఎంత వృద్ధుడైనా వివాహం తప్పనిసరి. మండి తెగకు చెందిన ఒరోలా అనే అమ్మాయి ఈ నిబంధనను ఎత్తి చూపింది. తనకు బలవంతంగా సవతి తండ్రితో వివాహం జరిపించారని తెలిపింది. ఒరోలా చెప్పిన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-12-05T19:26:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising