గేర్ కార్, నాన్ గేర్డ్ కార్ ఏది బెటర్.. ఏది అత్యధిక మైలేజ్ ఇస్తుందంటే...
ABN, First Publish Date - 2023-04-19T08:09:49+05:30
కారు కొనుగోలు చేసినప్పుడు లేదా కార్లకు సంబంధించిన సమాచారం తెలుసుకునేటప్పుడు గేర్ కార్, నాన్ గేర్డ్ కార్‌కు సంబంధించిన అనేక సందేహాలు మన మనసులో తలెత్తుతాయి.
కారు కొనుగోలు చేసినప్పుడు లేదా కార్లకు సంబంధించిన సమాచారం తెలుసుకునేటప్పుడు గేర్ కార్, నాన్ గేర్డ్ కార్(Gear car, non-geared car)కు సంబంధించిన అనేక సందేహాలు మన మనసులో తలెత్తుతాయి. నిజానికి గేర్, నాన్-గేర్డ్ కార్లు విభిన్న ప్రయోజనాలు కలిగివుంటాయి. గేర్ ఉన్న కారు మైలేజీ విషయానికి వస్తే ఇది సాధారణంగా గేర్ లేని కార్ల కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే గేర్డ్ కార్లు మెరుగైన ట్రాన్స్‌మిషన్(Transmission), ఇంజన్ కలిగివుంటాయి.
నాన్-గేర్డ్ కార్ల కంటే గేర్ ఉన్న కార్లు ఎక్కువ మైలేజీని ఇస్తాయి. అయితే ఇది మీరు ఎంచుకున్న కారుపై కూడా ఆధారపడి ఉంటుంది. గేర్డ్ వాహనాలతో పోలిస్తే మెరుగైన మైలేజీ(Mileage)ని ఇచ్చే అనేక నాన్-గేర్డ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీరు మీ అవసరాలకు అనుగుణంగా గేర్ లేదా నాన్-గేర్డ్ కారును ఎంచుకోవచ్చు. ఇంతేకాకుండా గేర్లు లేని కార్ల కంటే గేర్లు ఉన్న కార్లు ఎక్కువ శక్తిని ఆదా చేస్తాయి. గేర్ లేని వాహనాల కంటే గేర్డ్ కార్లు మెరుగైన టార్క్(Torque)ను అందిస్తాయి.
ఇదిలావుంటే వాహనాన్ని పార్క్ చేస్తున్నప్పుడు ఏ గేర్‌తో ఎంగేజ్ చేయాలో తెలియక చాలామంది గందరగోళానికి లోనవుతుంటారు, అటువంటి సందర్భంలో మొదటి గేర్ ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా మీ కారు ఒకే చోట లాక్(Lock) అవుతుందని, ఆ స్థలం నుండి అది కదలదని తెలిపారు.
Updated Date - 2023-04-19T08:40:52+05:30 IST