Funny Video: వధువును ఎత్తుకుని మెట్లు దిగుతూ అకస్మాత్తుగా కిందపడిపోయాడు.. మరుక్షణమే వరుడు చేసిన పనేంటో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-03-07T15:24:21+05:30
దాంపత్య జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లడం సర్వసాధారణం. తప్పు చేసిన వారు తమ భాగస్వామికి తమదైన పద్ధతిలో సారీ చెప్పి వారిని కూల్ చేస్తుంటారు. అయితే ఓ యువకుడు పెళ్లి వేడుక సమయంలోనే పొరపాటు చేశాడు.
దాంపత్య జీవితంలో (Marriede Life) చిన్న చిన్న పొరపాట్లు దొర్లడం సర్వసాధారణం. తప్పు చేసిన వారు తమ భాగస్వామికి తమదైన పద్ధతిలో సారీ చెప్పి వారిని కూల్ చేస్తుంటారు. అయితే ఓ యువకుడు పెళ్లి వేడుక సమయంలోనే పొరపాటు చేశాడు. వధువుని పైకి ఎత్తుకుని కింద పడ్డాడు. అయితే వెంటనే ఆమెకు చాలా రొమాంటిక్‌గా సారీ చెప్పాడు. దీంతో వధువు మాత్రమే కాదు.. చుట్టూ వున్న వారు కూడా షాకయ్యారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. simpleweddings అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో వివాహం తర్వాత వధువును ఎత్తుకుని వరుడు వేదికపై నుంచి కిందకు దిగుతున్నాడు. అంతలో బ్యాలెన్స్ తప్పిపోయి కింత పడ్డాడు (Groom fell on the stairs with Bride). పడిపోయిన తర్వాత కూడా వధువును వదల లేదు. కోపంగా చూస్తున్న వధువును వెంటనే ముద్దు పెట్టుకున్నాడు (Groom kisses bride). అనంతరం లేచి నిల్చుని కిందకు దిగాడు. ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది. భార్యను ఎలా కూల్ చేయాలో అప్పుడే తెలుసుకున్నాడని చాలా మంది ఆ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.
Viral video: పెళ్లి వేదికపై వరుడి ఎదురుగా వధువు క్యూట్ డ్యాన్స్.. అతడి రియాక్షన్ ఏంటంటే..
Updated Date - 2023-03-07T15:24:21+05:30 IST