White Hair: రంగు వెంటనే పోతోందా..? తొందరగా తెల్ల జుట్టు బయటపడుతోందా..? ఈ మూడు చిట్కాలను పాటించండి చాలు..!
ABN, First Publish Date - 2023-03-17T16:39:25+05:30
ఈ మూడు చిట్కాలు పాటిస్తే.. జుట్టు రంగుపోవడం అనే మాటే ఉండదు. పైపెచ్చు..
చిన్నా పెద్దా తేడాలేకుండా ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందంటే అది తెల్లజుట్టనే(White Hair) చెప్పవచ్చు. చాలామంది తమ తెల్లజుట్టు కవర్ చెయ్యడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్ డైలు(Hair dye) తెచ్చి వాడుతుంటారు. నిమిషాల మీద జుట్టు నల్లగా అవుతుందని వీటికే మొగ్గు చూపుతారు. కానీ ఈ హెయిర్ డైలు ఎక్కువకాలం జుట్టును నల్లగా ఉంచలేవు. పైగా ఇందులో ఉన్న రసాయనాలు(Chemicals) మెదడులో ఉన్న నాడీ వ్యవస్థపై(Nerve System) ప్రభావం చూపి మతిమరుపు(Amnesia), అల్జీమర్(Alzheimer), తలనొప్పి(Headache) వంటి సమస్యలను కూడా కలిగిస్తాయి. అలా కాకుండా ఆరోగ్యంగానూ, ఎక్కువ కాలం నిలిచేవిధంగా రంగు వేసుకోవాలంటే ఇదిగో ఈ మూడు చిట్కాలు పాటించేయండి.
ఆరోగ్యకరమైన ఎంపిక..
తెల్లజుట్టును కవర్ చెయ్యడానికి హెయిర్ డై ల కంటే హెన్నా(Henna) చాలా శ్రేష్టం. ఈ విషయం మాకు తెలియదా అంటారేమో.. కానీ ఈ హెన్నా తయారు చేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నేరుగా హెన్నా అప్లై చేయడంకంటే.. మీరు ఉపయోగించాలని అనుకున్న హెన్నా పొడిలోకి టీ డికాక్షన్(Tea decoction) లేదా కాఫీ డికాక్షన్(Coffee decoction) కలపచ్చు. ఇందులో నిమ్మరసం(Lime Juice), కొన్ని చుక్కల నీలగిరి తైలం(Eucalyptus oil) కూడా జోడించుకోవచ్చు. జుట్టును తుమ్మెద రెక్కల్లా మార్చే బృంగరాజ్ పౌడర్(bhringraj Powder), మందారం(Hibiscus), మెంతిపొడి(Fenugreek Powder), ఉసిరి పొడి(Amla Powder or Gooseberry) కూడా కలపవచ్చు. మామూలు హెన్నాలో ఇవి కలపడం వల్ల జుట్టుకు లోతుగా నలుపు ఇస్తుంది. ఈ కారణంగా జుట్టుకు రంగు ఎక్కువ కాలం ఉంటుంది.
సమయం చాలా ముఖ్యం..
చాలామంది తలకు హెన్నా అప్లై చేసి ఓ గంట అవ్వగానే కడిగేస్తుంటారు. కానీ జుట్టు బాగా నలుపు రావాలన్నా.. ఎక్కువ కాలం రంగు వెలసిపోకుండా ఉన్నాలన్నా అది జుట్టులోకి బాగా ఇంకిపోవాలి. హెన్నా పట్టించి కనీసం రెండున్నర గంటసేపు(Two And Half Hour) అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్ళ(Hair Roots) వరకు నలుపురంగు ఏర్పడుతుంది. రెండున్నర గంట సమయం గడిచిన తరువాత సాధారణ నీటిని(Normal Water) తలస్నానానికి ఉపయోగించాలి. ఈ సందర్భంలో ఎలాంటి షాంపూలు ఉపయోగించకూడదు. షాంపూతో జుట్టు కడిగితే హెన్నా ఇచ్చిన నలుపు తొందరగా జుట్టునుండి వదిలిపోతుంది.
ఇవి తప్పక గుర్తుపెట్టుకోవాలి..
హమ్మయ్యా.. జుట్టుకు హెన్నా పెట్టుకోవడం, వాష్ చేయడం అయిపోయింది అనుకుంటారేమో.. జుట్టుకు హెన్నా పెట్టుకునేవారు బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే.. తలస్నానం రోజూ చేయకూడదు. వారంలో రెండుసార్లు చేయవచ్చు. తలస్నానానికి ఎక్కువ గాఢత కలిగిన, ఎక్కువ రసాయనాలతో నిండిన షాంపూ వాడకూడదు. ఇలాంటి షాంపూలతో తలస్నానం చేస్తే జుట్టురంగు తొందరగా వెలసిపోవడమే కాకుండా జుట్టు చాలా సున్నితంగా, పలుచగా మారిపోతుంది. జుట్టు కుదుళ్ళు బలహీనమవుతాయి. ముఖ్యంగా హెన్నా పెట్టిన 24గంటలవరకు జుట్టుకు షాంపూ టచ్ కాకూడదు. ఈ మూడు పక్కాగా ఫాలో అయ్యి చూడండి. మీ జుట్టులో మార్పు మీకే తెలుస్తుంది.
Read also: Gas Problem: కడుపంతా గ్యాస్ నిండిపోయి ఉబ్బరంగా ఉంటుందా? ఒక్కసారి ఇలా చేసి చూడండి..
Updated Date - 2023-03-17T16:39:49+05:30 IST