ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంఖనాదం ఎంతో పవిత్రమని చెబుతారు... దుష్టశక్తులు దూరమవుతాయనీ అంటారు... మరి బద్రీనాథ్‌లో శంఖం ఎందుకు పూరించరంటే...

ABN, First Publish Date - 2023-05-02T13:28:18+05:30

దేవభూమి ఉత్తరాఖండ్(Uttarakhand) ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవభూమి ఉత్తరాఖండ్(Uttarakhand) ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ ప్రముఖ ఆలయాలే(Famous temples) కాకుండా చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ఉన్న అనేక దేవాలయాలలో అత్యంత ప్రసిద్ధమైనది బద్రీనాథ్ ఆలయం(Badrinath Temple). ఈ ఆలయం విష్ణువుకు నిలయం. సాధారణంగా హిందూ దేవాలయాలలో శంఖం శబ్ధంతో దేవతలను ఆహ్వానిస్తారు,

అయితే బద్రీనాథ్ ఆలయంలో ఈ విధంగా జరగదు. ఇక్కడ శంఖం ఊదకపోవడం వెనుక మతపరమైన, శాస్త్రోక్తమైన కారణాలున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బద్రీనాథ్‌లోని తులసీ భవన్‌(Tulsi Bhavan)లో లక్ష్మీదేవి ధ్యానం చేస్తుంటుందని చెబుతారు. పురాణ కాలంలో విష్ణువు.. శంఖచూర్ణ అనే రాక్షసుడిని సంహరించాడు. సాధారణంగా హిందువులు విజయం సాధించినప్పుడు శంఖం ఊదుతారు. అయితే విష్ణువు... లక్షీదేవి(Lakshi Devi) ధ్యానానికి భంగం కలిగించకూడదని భావించి, శంఖాన్ని పూరించలేదని చెబుతారు.

అగస్త్య ముని కేదార్‌నాథ్‌లో రాక్షసులతో పోరాడుతున్నప్పుడు, ఆతాపి, వాతాపి(Atapi, Vatapi) అనే రాక్షసులు అక్కడి నుండి పారిపోయారని, ఆ తర్వాత ఆతాపి తన ప్రాణాలను కాపాడుకోవడానికి మందాకిని నది సహాయం తీసుకోగా, వాతాపి శంఖం(Conch) లోపల దాక్కున్నాడట. ఈ కారణంగానే బద్రీనాథ్‌లో ఎవరైనా శంఖం ఊదితే వాతాపి పారిపోతాడని చెబుతారు.

బద్రీనాథ్‌లో శంఖం ఊదకపోవడానికి మరో కారణం కూడా ఉంది. చలికాలం(winter)లో ఇక్కడ శంఖం ఊదితే ప్రతిధ్వనిని సృష్టిస్తుందని. ఫలితంగా మంచు తుఫాను ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అలాగే అక్కడ శంఖనాదం చేస్తే పర్యావరణానికి గణనీయమైన నష్టం(significant loss) కలుగుతుందని కూడా చెబుతారు.

Updated Date - 2023-05-02T13:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising