ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలతో నిద్ర లేస్తున్నారా? అయితే ఆ శ్రావ్యమైన శబ్ధాలకు కారణమేమిటో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-04-18T12:57:07+05:30

చాలామంది ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలతో నిద్ర(sleep) నుంచి మేల్కొంటుంటారు. ఆ శ్రావ్యమైన శబ్ధాలను వింటూనే దినచర్యను ప్రారంభిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలామంది ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలతో నిద్ర(sleep) నుంచి మేల్కొంటుంటారు. ఆ శ్రావ్యమైన శబ్ధాలను వింటూనే దినచర్యను ప్రారంభిస్తారు. అయితే తెల్లవారుతున్నప్పుడు పక్షులు(birds) ఎందుకు కిలకిలారావాలు చేస్తాయో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏబీసీ సైన్స్ జర్నల్(ABC Science Journal) అందిచిన నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం పక్షుల కిలకిలారావాలకు కారణం వాటి లోపల జరిగే హార్మోన్ల(Hormonal) హెచ్చుతగ్గులు. సాయంత్రం, రాత్రి సమయంలో పక్షులలో హార్మోన్ల స్థాయి చాలా వేగంగా పెరుగుతుందని శాస్త్రవేత్తల పరిశోధన(Research)లో వెల్లడైంది. ఉదయం అవుతున్న కొద్దీ ఈ హార్మోన్ స్థాయి వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. అందుకే ఆ పక్షుల కిలకిలరావాలు చేస్తాయి. మరోవైపు పక్షులు ఉదయాన్నే(morning) మేల్కొనడం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తాయి.

మరో కొత్త రోజు ప్రారంభమయ్యిందని తమ సహచరులకు గుర్తు చేయడానికి అవి వీలైనంత బిగ్గరగా కిలకిలారావాలు చేస్తాయట. కాగా శాస్త్రవేత్తలు(Scientists) తమ పరిశోధనలో కొన్ని ప్రత్యేక జాతుల పక్షులు కూడా ఒకే రకమైన హమ్మింగ్ సమయాన్ని కలిగి ఉన్నాయని కనుగొన్నారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు కొన్ని జాతుల పక్షుల సంతానోత్పత్తి(Fertility) కాలం. ఈ సమయంలో ఈ జాతికి చెందిన పక్షులు ఉదయం పూట ఎక్కువగా కిలకిలారావాలు చేస్తాయి. పిచ్చుక ఏడాది పొడవునా హమ్(Hmm) చేస్తుంటుంది.

Updated Date - 2023-04-18T12:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising