ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోయిన వ్యక్తి కళ్లు ఎందుకు తెరుచుకుని ఉంటాయి? అలా ఉంటే కీడు జరుగుతుందా? దీనికి విజ్ఞానశాస్త్రం ఏమి సమాధానం చెబుతున్నదంటే...

ABN, First Publish Date - 2023-05-02T11:34:12+05:30

మనిషి చనిపోయాక శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మనిషి చనిపోయినప్పుడు అతని కళ్లు(eyes) తెరుచుకుని ఉంటే అక్కడున్న ఎవరో ఒకరు వాటిని మూసివేస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషి చనిపోయాక శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మనిషి చనిపోయినప్పుడు అతని కళ్లు(eyes) తెరుచుకుని ఉంటే అక్కడున్న ఎవరో ఒకరు వాటిని మూసివేస్తుంటారు. ఇటువంటి దృశ్యాలను సినిమాల్లో చూపిస్తుంటారు. చనిపోయిన వ్యక్తి కళ్లు తెరుచుకుని ఉండటం మంచిది కాదని భావిస్తూ చాలా మంది ఇదేపని చేస్తారు. అయితే మరణించిన వ్యక్తి కళ్లు తెరుచుకుని ఉండటం వెనుక శాస్త్రీయ కారణం(Scientific reason) ఉంది.

శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే, మన కనురెప్పలు కూడా కేంద్ర నాడీ వ్యవస్థ(central nervous system) ద్వారా నియంత్రితమవుతుంటాయి. నాడీ వ్యవస్థ మెదడుకు ఒక సంకేతాన్ని పంపుతుంది, ఇది కనురెప్పలను మూసివేయమని ఆదేశిస్తుంది. ఈ వ్యవస్థ ప్రాణంతో ఉన్న వ్యక్తిలో జరుగుతుంటుంది.

ఈ కారణంగానే బయట దుమ్ము ఎగిరినప్పుడు లేదా ప్రకాశవంతమైన కాంతి(bright light) ఉన్నప్పుడు లేదా మనం నిద్రించబోతున్నప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం. అయితే మరణించినప్పుడు కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేయడం ఆగిపోతుంది. దీని కారణంగా కళ్ళపై నియంత్రణ(control) పోతుంది. ఫలితంగా కనురెప్పలు తెరుచుకుని ఉండిపోతాయి.

కళ్ళు తెరవడం, మూయడం అనేది కళ్లకు అనుసంధానమైన కండరాల(Muscle) ద్వారా జరుగుతుంది. మరణం కారణంగా వీటి కార్యకలాపాలు ముగిసిపోతాయి. అయితే మనిషి చనిపోయిన ఐదు గంటల వరకూ అతని కళ్లు ఉపయుక్తంగా ఉంటాయని, ఆ లోపునే వాటిని దానం(donation) చేయాలని వైద్యులు చెబుతుంటారు.

Updated Date - 2023-05-02T11:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising